Betting: రఘురామ మెజార్టీపై జోరుగా బెట్టింగ్..!!
ABN, Publish Date - May 22 , 2024 | 06:24 PM
మరో రెండు వారాల్లో లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. జూన్ 4వ తేదీన సరిగ్గా 8 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు, వచ్చే మెజార్టీపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది.
పశ్చిమ గోదావరి: మరో రెండు వారాల్లో లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. జూన్ 4వ తేదీన సరిగ్గా 8 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు, వచ్చే మెజార్టీపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ నేత రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) ఈ సారి ఉండి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎం జగన్‌పై విమర్శలు చేయడంతో రఘురామపై ఏపీ సర్కార్ కక్షసాధింపు కార్యక్రమాలు చేపట్టింది. దాంతో నాలుగేళ్లు ఢిల్లీలోనే ఉండిపోయారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.
బెట్టింగ్స్
రఘురామ కృష్ణరాజు విజయంపై ఉండి నియోజకవర్గంలో జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. కూటమి అభ్యర్థి విజయం ఖాయం అని పలువురు ధీమాతో ఉన్నారు. రఘురామకు 15 వేల మెజార్టీ వస్తుందని కొందరు పందెం కాస్తున్నారు. మరొకరు అంత మెజార్టీ రాదని అంటున్నారు. రఘురామ విజయంపై రూ.35 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల భూములను కూడా బెట్టింగ్ పెడుతున్నారని తెలిసింది. కాళ్ల మండలంలో భూములను పందెం కాస్తున్నారట. రఘురామ విజయం, మెజార్టీ గురించి తమకు ఉన్న భూమిలో కొంచెం బెట్టింగ్ పెడుతున్నారని సమాచారం.
For more Election News and Telugu News
Updated Date - May 22 , 2024 | 06:29 PM