ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఏపీ నుంచి ఐప్యాక్‌ ఔట్‌..? ... షాక్‌లో వైసీపీ పెద్దలు

ABN, Publish Date - May 21 , 2024 | 05:28 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) వైఎస్సార్సీపీకి (YSRCP) ఓటమి భయం వెంటాడుతోనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు.

i - pac

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) వైఎస్సార్సీపీకి (YSRCP) ఓటమి భయం వెంటాడుతోనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీనికితోడు నిత్యం జగన్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే ఐ ప్యాక్ బృందం కూడా వైసీపీకి ప్యాకప్‌ చెబుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఓటమిని ముందుగానే ఊహించిందో ఏమోకాని ఐ ప్యాక్ ఉద్యోగులు ఏపీ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

300 మంది ఉద్యోగులు గుడ్ బై

ఏపీకి ఐ ప్యాక్ బృందం గుడ్ బై చెప్పేసిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపంలోని ఓ భవనంలో ఉన్న ఐ ప్యాక్ బృందం గప్‌చిప్‌గా ప్యాకప్ చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐప్యాక్‌లో ఉన్నట్టుండి 300 మంది ఉద్యోగులు వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల విజయవాడలోని ఐ ప్యాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లి ఇక మీదట వైఎస్సార్సీపీకి ఐ ప్యాక్ సేవలు కొనసాగుతాయని ప్రకటించారు. అయినా కూడా ఉద్యోగులు వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగానే...

గత ఐదేళ్లలో జగన్ చెప్పినట్లుగానే ఐప్యాక్ ఉద్యోగులు నడుచుకున్నారు. సొంత పార్టీ కార్యకర్తలను కాదనుకొని ఐ ప్యాక్ టీం చెప్పినట్లుగానే జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు అంతా వ్యవహరించారు. ఇప్పటికే జగన్ ఓడిపోతున్నారంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తేల్చిచెప్పారు. మరో వైపు తెలుగుదేశం పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్న సజ్జల భార్గవరెడ్డిపై ఏపీ సీఐడీ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓడిపోతే ఇబ్బందులు తప్పవని భావించి.... ఐ ప్యాక్ సంస్థ నుంచి ఉద్యోగులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

ఆ గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి: సోమిరెడ్డి

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

. సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 05:40 PM

Advertising
Advertising