ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: కడప ఎంపీగా గెలిస్తే.. కేంద్రమంత్రిని అవుతా..: షర్మిల

ABN, Publish Date - May 01 , 2024 | 03:06 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.

YS Sharmila

కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ (Jagan) లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్‌కు జగన్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా? అని అడిగారు. అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని విరుచుకుపడ్డారు.


‘వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండగ. నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు లేడు. పంట నష్ట పరిహారం అని మోసం చేశాడు. ధరల స్థిరీకరణ నిధి అని ఛీట్ చేశాడు. నిరుద్యోగ బిడ్డలను వంచనకు గురిచేశాడు. 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి, అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఇవ్వాళ్టికి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నేను వైఎస్ఆర్ బిడ్డ.. పులి బిడ్డ. నా గుండెలో దమ్ముంది. న్యాయం కోసం ఎంపీగా పోటీ చేస్తున్నా. మళ్ళీ నిందితుడికి ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయం. మీరు న్యాయం వైపు ఉంటారా ? అన్యాయం వైపు ఉంటారో కడప గడ్డ ప్రజలు ఆలోచన చేయాలి. నేను పుట్టింది ఇక్కడే...ఇది నా గడ్డ. ఇక్కడే ఉంట.. ప్రజా సేవ చేస్తా అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.


‘కడప ఎంపీగా అనాడు వైఎస్ఆర్ పని చేశాడు. వైఎస్ వివేకా కూడా ఎంపీగా గెలిచారు. ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీకి దిగింది. వైఎస్ వివేకాను హత్య చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి. హత్య జరిగిన సమయంలో మాకు ఈ విషయం తెలియదు. సీబీఐ ఆధారాలు చూపించిన తర్వాత నమ్మాల్సి వచ్చింది. అన్ని ఆధారాలు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని చెబుతున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కర్ఫ్యూ సృష్టించారు. సీబీఐకి సహకరించకుండా అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా చూశారు అని’ తేల్చి చెప్పారు.


Read Latest
AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 03:56 PM

Advertising
Advertising