AP Election 2024: రాజకీయ పార్టీలు అలా చేయొద్దు.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ABN, Publish Date - May 11 , 2024 | 05:27 PM
ఏపీలో మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిస్తుందని తెలిపారు. అన్ని చోట్లా రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే 6 గంటల తర్వాత స్థానికులు కానీ రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల్లో నించి వెళ్లిపోవాలని ఆదేశించారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగుస్తుందని తెలిపారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. 144 సెక్షన్ ఏపీ వ్యాప్తంగా అమలవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే 6 గంటల తర్వాత స్థానికేతర రాజకీయ నేతలు అంతా ఆయా నియోజకవర్గాల్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
అయితే పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయొద్దని హెచ్చరించారు. శనివారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 13న 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని తెలిపారు.
Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..
టీవీ,రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం ముగుస్తుందని చెప్పారు. పత్రికల్లో ప్రకటనల కోసం ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని అన్నారు. రేపు సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తారని తెలిపారు. పోలింగ్‌కు 90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని వివరించారు. 13 తేదీన సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలు అవుతుందని ప్రకటించారు. పోలింగ్ ఏజెంట్‌కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చామన్నారు.నియోజకవర్గంలో స్థానికుడైన అభ్యర్థి నుంచి ధ్రువపత్రాల తీసుకుంటే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్ గా అనుమతి ఇవ్వొచ్చని వివరించారు. అలాగే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లీప్‍లు పంచుకోవచ్చని అన్నారు.
అలాగే పోలింగ్ రోజు ప్రజల రవాణాను నిరోధించాలని ఎన్నికల సంఘం ఉద్దేశ్యం కాదన్నారు.ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకమని అన్నారు. అభ్యర్థికి సంబంధించి వాహనాల పరిమితి ఉందన్నారు. మూడు వాహనాల వరకే సదరు అభ్యర్థి వినియోగించుకోవచ్చని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకెవెళ్లేందుకు అనుమతి లేదన్నారు.ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదన్నారు.అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించామని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని సీఈఓ మీనా తెలిపారు.
Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్
Read Latest AP News And Telugu News
Updated Date - May 11 , 2024 | 06:34 PM