AP Elections: ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్టు ఉంది: లోకేశ్
ABN, Publish Date - Apr 27 , 2024 | 08:06 PM
వైసీపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. మేనిఫెస్టో చూసి వైసీపీ అభిమానులు కూడా హార్ట్ అయ్యారు. పాత చింతకాయ పచ్చడిలా ఉందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శించింది. మేనిఫెస్టోపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎన్నికలకు ముందే జగన్ రాజీనామా చేసినట్టు ఉందని విమర్శించారు.
అమరావతి: వైసీపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. మేనిఫెస్టో చూసి వైసీపీ అభిమానులు కూడా హార్ట్ అయ్యారు. పాత చింతకాయ పచ్చడిలా ఉందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శించింది. మేనిఫెస్టోపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎన్నికలకు ముందే జగన్ రాజీనామా చేసినట్టు ఉందని విమర్శించారు.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
లోకేశ్ ఏమన్నారంటే..?
‘రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేసింది చంద్రబాబు. అయిదేళ్లలో పెన్షన్ రూ. 500 పెంచుతాననిప్రకటించడం దివాలాకోరు తనానికి నిదర్శనం. ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం చేసినట్టు మేనిఫెస్టో చూస్తే స్పష్టం అవుతోంది. దీనిని బట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.వెయ్యి పెంచుతాం. ప్రస్తుతం పెన్షన్ రూ.3 వేలు ఉంది. పెన్షన్ నగదును వాలంటీర్ల ద్వారా అవ్వ తాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత మాది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని’ నారా లోకేష్ స్పష్టం చేశారు.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
Read More Andhra Pradesh and Telugu News Here
Updated Date - Apr 27 , 2024 | 08:08 PM