AP Elections: జగన్‌పై రాయి దాడి.. మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ABN, Publish Date - Apr 24 , 2024 | 09:17 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలకు గాయం ఘటనను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవం గ్రహించడంతో వైసీపీ కుట్రలు ఫలించలేదన్నారు. గులక రాయితో ఎవరు కొట్టారో లేదా జగన్ కొట్టించుకున్నారో ప్రజలకే తెలుసన్నారు. విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలకు గాయం ఘటనను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవం గ్రహించడంతో వైసీపీ కుట్రలు ఫలించలేదన్నారు. గులక రాయితో ఎవరు కొట్టారో లేదా జగన్ కొట్టించుకున్నారో ప్రజలకే తెలుసన్నారు. విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్ధాల పాటుర రాజకీయ పోరాటం చేసిన చంద్రబాబులో వాడి, వేడి ఇంకా తగ్గలేదన్నారు.
రాష్ట్రంలో ఎవరు నవ్వినా, ఎవరి దగ్గర డబ్బులున్నా, మంచి బట్టలేసుకున్నా జగన్ చూడలేరన్నారు. గొప్ప నేత చంద్రబాబుని జైల్లో చూసి చలించిపోయానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రాలో వలసలు ఆగాలంటే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రభుత్వం రాగానే జూట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రామతీర్ధంలో రాముడు విగ్రహం తల నరికిన సందర్భాన్ని తాను ఇప్పటికీ జీర్ణంచుకోలేకపోతున్నానని తెలిపారు.
AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ
ఎన్డీయే ప్రభుత్వం రాగానే..
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో బలమైన లా అండ్ ఆర్డర్‌ను తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చెల్లికి మళ్లీ పెళ్లి అన్నట్టు జగన్ వ్యవహరించారని ఆరోపించారు. చాళుక్యుల కాలంలో నవనందుల పాలన, జగన్ హింసా, నేరం, దోపిడి పాలన ఒకటేనని విమర్శించారు. తన సొంత ఛానల్‌లో డిజిటల్ పువ్వులు తప్ప, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. ఉద్దానం కీడ్నీ సమస్య గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే గంటల వ్యవధిలో స్పందించారన్నారు. నది పేరు ఏదైనా జగన్‌కు తెలిసింది ఇసుక దోపిడి మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే తూర్పు కాపులను బిసి-ఎలో చేర్చేందుకు చొరవ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మే13వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పోలింగ్ బూత్‌లో తమ ఓటు ద్వారా ఫ్యాన్ స్విచ్ ఆపేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Updated Date - Apr 24 , 2024 | 09:17 PM