Pawan Kalyan: అలా చేస్తేనే... గులక రాయి విసిరిన చేయి.. ఆ చేయి వెనకున్నదెవరో బయటపడుతుంది...
ABN, Publish Date - Apr 15 , 2024 | 04:53 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ రాయి దాడిలో డీజీపీ, ఇంటిలిజెన్స్ ఛీఫ్‌ను తొలగిచాలంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి... చెట్లు కొట్టేసేవారని అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా అని అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 15: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (CM Jaganmohan Reddy)రాళ్ల దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ రాయి దాడిలో డీజీపీ, ఇంటిలిజెన్స్ ఛీఫ్‌ను తొలగిచాలంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి... చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు... చెట్లూ కొట్టలేదు?’’ అని నిలదీశారు.
Loksabha Polls: ఊపందుకున్న ప్రచారం.. భారీగా పట్టుబడుతోన్న నగదు.. ఎంతంటే..
ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు తీసుకున్న భద్రతా చర్యల్లో లోపాలు ఏమిటని.. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలన్నారు. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే.. గులక రాయి విసిరిన చేయి... ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుందన్నారు. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయని గుర్తుచేశారు. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధానమంత్రి మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని విమర్శించారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
TDP: గులకరాయి నాటకంలో వెల్లంపల్లి ఓ బఫూన్...
AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి పట్టేయండి!
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 15 , 2024 | 05:06 PM