AP Elections: ఏపీలో వార్ వన్ సైడే.. బటన్ రెడ్డికి ఇదే ఆఖరి బటన్
ABN, Publish Date - May 06 , 2024 | 02:40 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (YS Jagan) జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ రెండు సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పృథ్వీరాజ్ సవాల్ చేశారు. కడప, చిత్తూరు జిల్లాలో వైసీపీతో సమానంగా కూటమికి ప్రజల మద్దతు ఉందన్నారు. దీనిని బట్టి మొత్తంగా వార్ వన్ సైడ్ ఉందని వివరించారు.
‘సీఎం జగన్ రాళ్ల దాడి గురించి ప్రస్తావిస్తూ.. దొంగ కట్లు, స్టిక్కర్లతో సినిమాల్లో లేని డ్రామాను క్రియేట్ చేశారు. బటన్ రెడ్డికి ఇదే అఖరి బటన్ అవుతుంది. జర్నలిస్ట్ సజ్జలకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి..? వైసీపీ అనేది టెర్రరిస్టు శిక్షణ శిబిరం. పోర్న్ స్టార్, దౌర్భగ్యులు ఉన్న పార్టీ వైసీపీ. గతంలో తిరుపతి లడ్డూతో బస్సు ఎక్కితే బస్సు మొత్తం సువాసనలు వచ్చేది. ఇప్పుడు లడ్డూ నాణ్యత లేదు, సువాసన లేదు. రాష్ట్రంలో దోపిడీ, అరాచకం రాజ్యమేలాయి. ముద్రగడ పేరు ఎప్పుడో మార్చాను. రెడ్లకు ఊడిగం చేసే ముద్రగడ పేరును ఈ రోజు ప్రెస్ క్లబ్‌లో రిలీజ్ చేస్తాం. మార్పు జరగబోతోంది కాబట్టి ప్రకతి స్పందించి కుటుంబ సభ్యుల చేత నిజాలు చెప్పిస్తోంది. మన ఆస్తిని రెండేళ్లకోసారి రెన్యూవల్ చేయకుంటే ఇతరులది అయిపోతుందట. దానిపై కోర్టుకు వెళ్లడానికి లేదట. దుర్గంధంగా ఉన్న విశాఖ యాంకర్ శ్యామలకు సుందరంగా కనిపించిందట. శ్యామల కనపడితే కొడతామని విశాఖ వాసులు అంటున్నారు. అని’ పృథ్వీ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Latest AP News And Telugu news
Updated Date - May 06 , 2024 | 02:40 PM