ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arani Srinivasulu: నేను నాన్ లోకల్ కాదు.. లోకలే

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:08 AM

Andhrapradesh: తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని జనసేన- టీడీపీ - బీజేపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

తిరుపతి, మార్చి 19: తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని జనసేన- టీడీపీ - బీజేపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు (Janasena-TDP-BJP candidate Arani Srinivasulu) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ‘‘నేను నాన్ లోకల్ కాదు..లోకలే. 2009లోనే పద్మావతిపురంలో నాకు సొంత ఇళ్ళు ఉంది. తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటూనే వచ్చాను. కొంతమంది నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను వైసీపీకి (YSRCP) కోవర్టును కాదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సిద్ధాంతాలు నచ్చి జనసేనలో (Janasena) చేరాను. నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. ఐదేళ్ళ వైసీపీ పాలన మొత్తం అవినీతిమయం. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చారు. వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేసిన అక్రమాలు అందరికీ తెలుసు. తిరుపతి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తా. జనసేన- టీడీపీ - బీజేపీ (Janasena-TDP-BJP) నేతలందరూ నా వెంటే ఉన్నారు’’ అని ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.

YSRCP: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు వైసీపీ ఎమ్మెల్యే యత్నం

జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ... రాజకీయాల్లో అనుభవం కలిగిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులు అని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్న ఆరణికి సీటు కేటాయించడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులును గెలిపించుకుందామని.. మొదటి సీటు తిరుపతిలో శ్రీనివాసులును గెలిపించుకుని పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 19 , 2024 | 11:39 AM

Advertising
Advertising