ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ABN, Publish Date - Apr 23 , 2024 | 10:42 PM

అనపర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్, దగ్గుబాటి పురందేశ్వరి కాషాయం కండువా కప్పారు. టీడీపీ నుంచి అనపర్తి సీటును నల్లమిల్లి ఆశించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్, దగ్గుబాటి పురందేశ్వరి కాషాయం కండువా కప్పారు. టీడీపీ నుంచి అనపర్తి సీటును నల్లమిల్లి ఆశించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీ (BJP) కి కేటాయించారు. కొన్ని రోజులుగా ఈ సీటుపై టీడీపీ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో దిగనున్నారు.


Pawan Kalyan: నామినేషన్ అనంతరం జనసేనాని కీలక వ్యాఖ్యలు

బీజేపీ అగ్రనేతలు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల సంగ్రామంలో నిమగ్నం అయ్యామని తెలిపారు. అనపర్తి నుంచి నల్లమిల్లి బీజేపీలో‌ చేరారని అన్నారు. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు. శివరామకృష్ణం రాజుకి ఈ సందర్భంగా తమ తరపున ధన్యవాదాలు చెప్పారు. నల్లమిల్లి రామకృష్షారెడ్డి విజయం కోసం అందరూ పని చేస్తారన్నారు. నల్లమిల్లి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తప్పకుండా అనపర్తి నుంచి విజయం సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు. రాజమండ్రి ఎంపీగా తాను కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నానని వివరించారు.కూటమి పార్టీల నాయకులు కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి హామీ ఇచ్చారు.


AP Election 2024: ఈ సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది... జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 10:48 PM

Advertising
Advertising