ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: త్వరలో రాష్ట్రంలో సంచలన ఘటనలు.. ముందే పసిగట్టిన నెటిజన్లు..

ABN, Publish Date - Apr 14 , 2024 | 10:45 AM

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల పర్వం వేడెక్కుతోంది. విజయవాడలో సీఎం జగన్ బస్సు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో జరిగిన రాయి దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల పర్వం వేడెక్కుతోంది. విజయవాడలో సీఎం జగన్ బస్సు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో జరిగిన రాయి దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే రాష్ట్రంలో జరగబోయే సంఘటనలను కొందరు ముందుగానే అంచనా వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

YCP: సీఎం జగన్‌పై విసిరిన రాయి ఘటనపై పలు అనుమానాలు..


అవుతూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పోస్ట్ చేశారు. ఇవి ఎన్నికల మూడ్ ను మార్చేస్తాయని ముందుగానే అంచనా వేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.


Hyderabad: చల్లబడిన వాతావరణం.. మరో రెండు రోజులు ఇలాగే..

కాగా.. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 14 , 2024 | 10:52 AM

Advertising
Advertising