AP Election Polling 2024: అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన ఎన్ఆర్ఐ
ABN, Publish Date - May 13 , 2024 | 08:34 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.
పశ్చిమగోదావరి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.
వివరాల్లోకి వెళ్తే... ఏపీలోని తణుకు సజ్జాపురంలో ఎన్ఆర్ఐ బత్తుల హరిప్రియ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అమెరికా నుంచి హరిప్రియ వచ్చారు. వృత్తిరీత్యా అమెరికాలో జీవిస్తున్నా.. ఓటు విలువ తెలిసి ఇక్కడకు వచ్చానని ఆమె తెలిపారు. ఓటు వేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఓటు భావితరాలు, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుందని హరిప్రియ పేర్కొన్నారు.
Updated Date - May 13 , 2024 | 08:34 PM