ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: ‘కూటమి ప్రభుత్వం వచ్చాక.. మొదటి సంతకం దానిపైనే’

ABN, Publish Date - May 02 , 2024 | 09:30 PM

తమ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తామని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీపీఎస్‌కు పరిష్కార మార్గం చూపిస్తామని.. దానికి సమానమైన ప్రత్యామ్నాయ మార్గాలను..

తమ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP-Janasena-BJP Alliance) ప్రభుత్వం ఏర్పడితే.. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే (Mega DSC) చేస్తామని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. సీపీఎస్‌కు పరిష్కార మార్గం చూపిస్తామని.. దానికి సమానమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో నిర్వహించిన సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఇస్తానని చెప్పిన జగన్.. ఆ పని చేశాడా? అని ప్రశ్నించారు. గిరిజన సబ్‌ప్లాన్‌ని సైతం అమలు చేయలేదని మండిపడ్డారు.


భానుడి ప్రతాపం వేళ.. పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని..

రూ.60 మద్యాన్ని జగన్ రూ.200లకు అమ్ముతున్నాడని ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్.. తోటపల్లి ఎడమ కాలువ, జంపరకోట రిజర్వాయర్ ఏమైందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని సైతం జగన్ తినేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర నదుల్లో ఇసుకను వైసీపీ నేతలు తోడేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. రంగుల కోసం జగన్ రూ.1300 కోట్లు ఖర్చు పెట్టాని, రూ.2300 కోట్లు రంగులు వేయడానికి, తొలగించడానికి తగులబెట్టారని దుయ్యబట్టారు. దోపిడీ దారులపై తిరగబడ్డ చరిత్ర సిక్కోలుది అని, మీ హక్కుల కోసం జగన్ లాంటి దోపిడీ దారుడిపై యువత పోరాడాలని పిలుపునిచ్చారు.

రాహుల్‌పై పాకిస్తాన్ ప్రశంసలు.. తీవ్రంగా మండిపడ్డ ప్రధాని మోదీ

తాను తండ్రి లేని బిడ్డనని, ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ అడగ్గానే అతనికి అవకాశం ఇచ్చారని.. ఇక చాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు కూటమికి ఓటు వేసి గెలిపించాలని జనసేనాని అభ్యర్థించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని మాటిచ్చారు. అంతకుముందు తనకు ఉత్తరాంధ్ర యాస అంటే ఎంతో ఇష్టమని చెప్పిన పవన్.. ఉత్తరాంధ్ర జానపదాలు పాడి యువతను ఉర్రూతలూగించారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 02 , 2024 | 09:30 PM

Advertising
Advertising