Pemmasani Chandrasekhar: త్వరలోనే జగన్‌కి ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్.. పెమ్మసాని షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Apr 24 , 2024 | 08:02 PM
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అన్యాయంగా జరిగిన భౌతికదాడి ఘటనని ప్రస్తావించారు. తనకు ఎదురైన ఈ దారుణానికి తగిన జవాబు ఇచ్చి తీరుతారని..
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో (Radha Krishna) జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై (Raghurama Krishnam Raju) అన్యాయంగా జరిగిన భౌతికదాడి ఘటనని ప్రస్తావించారు. తనకు ఎదురైన ఈ దారుణానికి తగిన జవాబు ఇచ్చి తీరుతారని.. వైఎస్ జగన్‌కి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని పేర్కొన్నారు. కృష్ణంరాజు ఇంకా బతికే ఉన్నారని.. కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే గడిచాయని.. ప్రతి ఒక్కరికీ తమ గ్రహాలు కలిసొచ్చే సమయం తప్పకుండా వస్తుందని అన్నారు.
తనకు కర్మసిద్ధాంతం మీద నమ్మకం ఉందన్న ఆయన.. మనిషి చేసే కర్మల వల్ల పాపం, పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పారు. ఒక వ్యక్తిపై చెయ్యి ఎత్తడం అనేది చట్టానికి విరుద్ధమని.. రఘురామ కృష్ణంరాజు పట్ల వైఎస్ జగన్ (YS Jagan) వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్‌కి, కృష్ణంరాజుపై చెయ్యెత్తిన వారికి చాలా సమయం ఉందని.. ఒకవేళ ఆ అధికారులు రిటైరనప్పటికీ ఇంకా భూమి మీదే బతికే ఉంటారని.. వాళ్లు చేసిన పనికి తగిన గుణపాఠం దక్కుతుందని పరోక్షంగా హెచ్చరించారు. ఒక ఎంపీని కొట్టడం అనేది చాలా అన్యాయం, ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు.
టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికీ నో ప్లేస్.. ఈ 15 మంది సెట్!
అంతకుముందు.. ఏపీలో వైసీపీ అరాచక పాలన, రాజకీయ పరిణామాలు చూసిన తర్వాతే ప్రజా సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని పెమ్మసాని చెప్పారు. తాను ఎవరి బెదిరింపులకు బెదిరేది లేదని, అన్ని తెగించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైసీపీ అరాచకాలను ఎదిరించే తెగువ తనకు ఉందని, అక్రమ కేసులు పెట్టినా ఎదిరించగల శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా తనపై భౌతికదాడి చేస్తే.. తనను కొట్టినవాడి చెయ్యిని తీసేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను జైల్లో పెడితే మరింత ఎక్కువ పోరాడతానన్నారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
Updated Date - Apr 24 , 2024 | 09:33 PM