ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: పోలింగ్ ఏజెంట్‌కు ఉండే హక్కులు ఏంటో తెలుసా..

ABN, Publish Date - May 12 , 2024 | 04:41 PM

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది పోలింగ్. ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే ప్రజలను పాలించే పాలకులు అవుతారు. ఈ పోలింగ్ రోజున ఎక్కువుగా వినిపించే పదం పోలింగ్ ఏజెంట్.. సాధారణంగా ఎన్నికల సిబ్బంది ఉంటారు. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇద్దరికీ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరు ఎన్నికల సంఘం తరపున వారికి కేటాయించిన విధులు నిర్వర్తిస్తారు.

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది పోలింగ్. ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే ప్రజలను పాలించే పాలకులు అవుతారు. ఈ పోలింగ్ రోజున ఎక్కువుగా వినిపించే పదం పోలింగ్ ఏజెంట్.. సాధారణంగా ఎన్నికల సిబ్బంది ఉంటారు. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇద్దరికీ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరు ఎన్నికల సంఘం తరపున వారికి కేటాయించిన విధులు నిర్వర్తిస్తారు. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లను ఆ నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థి నియమించుకుంటారు. ఆ పోలింగ్ ఏజెంట్ అభ్యర్థి తరపున విధులు నిర్వర్తిస్తారు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది ఎంత ముఖ్యమో.. పోలింగ్ ఏజెంట్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో పోలింగ్ ఏజెంట్ కీలక భూమిక పోషిస్తారు. ప్రత్యక్షంగా ఎన్నికల నిర్వహణలో జోక్యం లేకపోయినప్పటికీ.. పోలింగ్ ప్రక్రియ సజావుగా, అవకతవకలు లేకుండా జరగడానికి పోలింగ్ ఏజెంట్ సహకరిస్తాడు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏజెంట్ కీలకపాత్ర పోషిస్తాడు. ప్రధానంగా దొంగ ఓట్లు వేయకుండా నివారించేందుకు పోలింగ్ ఏజెంట్ విధానాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ శాతం పెంచడంలోనూ ఏజెంట్ పాత్ర కీలకంగా చెప్పుకోవచ్చు.

Vijayawada: ఎన్నికలకు సర్వం సిద్ధం.. సిరా విషయంలో కలెక్టర్ క్లారిటీ


పోలింగ్ ఏజెంట్ ఎందుకంటే..

గ్రామ పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఏ ఎన్నికైనా అభ్యర్థులు తమ తరపున పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. సాధారణంగా అన్ని బూత్‌లలో ఏజెంట్లను పెట్టడం అనేది కేవలం ప్రాధాన పార్టీ అభ్యర్థులకు మాత్రమే సాధ్యమవుతుంది. పార్టీ క్యాడర్ ఎక్కువుగా ఉండేవాళ్లు మాత్రమే ఏజెంట్లను నియమించుకోగలరు. కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఏజెంట్లను ఏర్పాటుచేసుకుంటారు. సాధారణంగా ఓ వ్యక్తి ఏదైనా పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా ఉండాలంటే ఆ వ్యక్తి స్థానికుడై ఉండాలి. అదే గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి. పోలింగ్‌లో పాల్గొనే వ్యక్తులను గుర్తించగలిగే వ్యక్తి అయి ఉండాలి. ఓటరు బూత్‌లోకి రాగానే పోలింగ్ సిబ్బందికి ఓటరు స్లిప్ ఇవ్వగానే ఓటరు జాబితాలో అతడి క్రమ సంఖ్య చెబుతారు. వెంటనే పోలింగ్ ఏజెంట్ తన వద్ద ఉన్న ఓటరు లిస్ట్‌లో ఆ సీరియల్ నెంబర్ మార్క్ చేసుకుంటారు. అలాగే జాబితాలో ఉన్న ఓటరు ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఒకరా కాదా అని చెక్‌ చేసుకుంటారు. జాబితాలో ఉన్న వ్యక్తి ఓటు వేసేందుకు ఉన్న వ్యక్తి ఒకరు కాకపోతే పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేయ్యొచ్చు. అప్పుడు ఆ వ్యక్తి ఓటు వేయకుండా సిబ్బంది ఆపుతారు. ఆ తరువాత విచారణ చేసి అసలు ఓటరా.. నకిలీ ఓటరా తేలుస్తారు. దొంగ ఓట్లు పడకుండా చూడటంలో పోలింగ్ ఏజెంట్ ప్రధాన పాత్ర పోషిస్తాడు.


పోలింగ్ శాతం పెంచడంలో భాగస్వామి..

పోలింగ్ ఏజెంట్ తన దగ్గరున్న ఓటర్ల జాబితాలో ఓటు వేయడానికి వచ్చినవారి పేర్లను మార్క్ చేసుకుంటాడు. దీంతో ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పోలింగ్ సమయం ముగియడానికి 3 గంటల ముందు నుంచి.. ఇంకా ఓటు వేయడానికి రానివాళ్ల వివరాలను తమ అభ్యర్థికి లేదా పార్టీ శ్రేణులకు తెలియజేస్తారు. దీంతో అందుబాటులో ఉండి ఓటు వేయడానికి రానివ్యక్తుల దగ్గరకు వెళ్లి వాళ్లను ఓటు వేసేలా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పోలింగ్ శాతం పెరగడంలో ఏజెంట్ తనకు తెలియకుండానే కీలక పాత్ర పోషిస్తాడు.


AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 04:41 PM

Advertising
Advertising