YS Sharmila: దాడులపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - May 13 , 2024 | 11:29 AM
ఏపీలో ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగానూ.. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. వేంపల్లె మండలం, ఇడుపుల పాయ పోలింగ్ బూత్ 261లో తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుతో పాలకులను ఎంచుకోవచ్చన్నారు. ఓటు ముందు ధనవంతుడు అయినా.. పేదవాడైనా ఒకటేనన్నారు.
కడప: ఏపీలో ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగానూ.. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. వేంపల్లె మండలం, ఇడుపుల పాయ పోలింగ్ బూత్ 261లో తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుతో పాలకులను ఎంచుకోవచ్చన్నారు. ఓటు ముందు ధనవంతుడు అయినా.. పేదవాడైనా ఒకటేనన్నారు. ఓటు వేయడం ఒక బాధ్యత అని పేర్కొన్నారు. కడప జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జరుగుతున్న దాడులపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలన్నారు. పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Updated Date - May 13 , 2024 | 11:29 AM