ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Fact Check: బరితెగింపు.. ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ ప్రచారం..!

ABN, Publish Date - May 07 , 2024 | 10:36 AM

దేశంలో ఎన్నికల వేళ తప్పుడు ప్రచారంతో కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వ్యాప్తిచేస్తున్నారు.

దేశంలో ఎన్నికల వేళ తప్పుడు ప్రచారంతో కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వ్యాప్తిచేస్తున్నారు. గతంలో భువనేశ్వరి విషయంలోనూ అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేశారు. ఏపీలో వైసీపీ నేతలే ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని చేస్తు్న్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.


తాజాగా ఆంధ్రజ్యోతి పేరుతో ఓ తప్పుడు కథనాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. వాస్తవానికి ఈ కథనంతో ఆంధ్రజ్యోతి సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ప్రచురించలేదు. కానీ కొంతమంది ఆంధ్రజ్యోతి పేరును వాడుకుని ఓ రాజకీయపార్టీకి లబ్ధికలిగేలా పేపర్‌లో రాని వార్తలను వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు వార్తలతో ఆంధ్రజ్యోతి సంస్థకు ఎలాంటి సంబంధం లేదు.

AP Elections: ‘‘నవ సందేహాలు’’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈసారి దేనిగురించంటే?


చంద్రబాబుపై తప్పుడు కథనం..

ల్యాండ్‌టైట్లింగ్ యాక్ట్‌పై మరింత దుష్ప్రచారం చేయాలంటూ చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారంటూ ఓ వార్తను అమరావతి- ఆంధ్రజ్యోతి డేట్‌లైన్‌తో సోషల్ మీడియలో వైరల్ చేస్తున్నారు. ఈసీ ఆదేశాలు పట్టించుకోవద్దంటూ చంద్రబాబు చెప్పినట్లు ఓ తప్పుడు వార్తను వైరల్ చేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ ఎంత ప్రమాదమో ప్రజలకు వివరించాలని మాత్రమే చాలా సభల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు. అంతేకాని ఈ చట్టంపై దుష్ప్రచారం చేయాలని కానీ, ఈసీ ఆదేశాలను పట్టించుకోవద్దని ఎప్పుడూ చెప్పలేదు. అయినా ఆంధ్రజ్యోతి పేరుతో ఓ తప్పుడు కథనాన్ని ప్రచురిస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని కోరుతున్నాము. ఎవరైనా ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తిచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాము.


PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 10:46 AM

Advertising
Advertising