ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: జిల్లాలకు ప్రత్యేక పోలీసులు.. ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు

ABN, Publish Date - May 25 , 2024 | 03:51 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్‌కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడం, ప్రస్తుత హింసాత్మక ఘటనల నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పలు జిల్లాల్లో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముందస్తు చర్యగా ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది పోలీస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ రోజు (శనివారం) సాయంత్రంలోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీస్ అధికారులకు డీజీపీ సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఏపీ డీజీపీ ఆదేశించారు.


పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను కేటాయించారు. పల్నాడు‌కు కేటాయించిన అధికారుల్లో ఆరుగురు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు. కాగా ఏపీ ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత రాష్ట్రంలోని పల్నాడు, నర్సారావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌటింగ్‌ను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే భారీగా పోలీసు అధికారులను నియమించినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

Balmoori Venkat:జీఓ 46 పైన పచ్చి అబద్ధాలు చెబుతున్న కేటీఆర్

AP Elections 2024: సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధం: దేవినేని ఉమ

Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు

AP Elections: బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటికి రాలేదేం..?

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 25 , 2024 | 04:42 PM

Advertising
Advertising