ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: డబ్బుల పంపిణీకి స్పెషల్ టీమ్స్.. నోటు అందకపోతే డోంట్ వర్రీ అంటున్న నేతలు..!

ABN, Publish Date - May 10 , 2024 | 11:19 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే టెన్షన్ అభ్యర్థుల్లో ఉంటే.. గ్రామాల్లో మాత్రం ఓటుకు నోటు కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే పంపకాలు ప్రారంభమైనట్లు సంకేతాలు రావడంతో గ్రామాల్లో ప్రజలు తమ ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారట. ఓటును నోటుతో కొనడం నేరం.. ఓటు కోసం డబ్బులివ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయినా ప్రస్తుతం రాజకీయలు డబ్బు మయం కావడంతో.. ఓట్లకు డబ్బుల పంపిణీ సర్వసాధారణం అయిపోయింది.

Note for Vote

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే టెన్షన్ అభ్యర్థుల్లో ఉంటే.. గ్రామాల్లో మాత్రం ఓటుకు నోటు కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే పంపకాలు ప్రారంభమైనట్లు సంకేతాలు రావడంతో గ్రామాల్లో ప్రజలు తమ ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారట. ఓటును నోటుతో కొనడం నేరం.. ఓటు కోసం డబ్బులివ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయినా ప్రస్తుతం రాజకీయలు డబ్బు మయం కావడంతో.. ఓట్లకు డబ్బుల పంపిణీ సర్వసాధారణం అయిపోయింది.పోలింగ్‌కు ఒకటి నుంచి రెండు రోజుల ముందు డబ్బులు పంపిణీ చేస్తుంటారు. ఈ ఎన్నికల్లో మాత్రం నాలగు రోజుల ముందే డబ్బుల పంపిణీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే డబ్బుల పంపిణీలో కొందరికి ఇవ్వడం, మరికొందరికి ఇవ్వకపోవడంతో అక్కడక్కడ తమకు ఇవ్వలేదంటూ ఓటర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితులు గతంలో చూశాం. ఈసారి అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

CPM(GS) Sitaram Yechury:ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు!


స్పెషల్ టీమ్స్

డబ్బుల పంపిణీకి నియోజకవర్గాల్లో అభ్యర్థులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న గ్రామాలకు రెండు టీమ్‌లు, పెద్ద గ్రామాలకు మూడు టీమ్‌ల చొప్పున ఏర్పాటు చేశారట. ఒక్కో టీమ్‌లో ఇద్దరు చొప్పున ఉండగా.. ఒకరు డబ్బులు ఇస్తే.. మరొకరు ఓటరు లిస్ట్‌లో టిక్ చేసుకునేందుకు వీలుగా ఇద్దరితో ఒక టీమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే గ్రామానికి ఒక పర్యవేక్షకుడిని నియమించారట. ఈ పర్యవేక్షకుడు అందరికీ డబ్బులు సక్రమంగా పంచుతున్నది లేనిది చూసేలా అభ్యర్థులు టీమ్స్ సెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డబ్బుల పంచిపెడుతున్న ఇద్దరిలో ఒకరు పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుడు కాగా.. మరొకరు అభ్యర్థికి సంబంధించిన సొంత మనిషి ఉండేలా చూసుకుంటున్నారట. గ్రామంలో ఓట్లు.. ఆ గ్రామంలో ఎంతమేర పంచాలనే లెక్కలు తేల్చి గ్రామాలవారీ నగదును ఇప్పటికే పంపిచినట్లు తెలుస్తోంది.


డబ్బు అందలేదా డోంట్ వర్రీ..!

గ్రామాల్లో అక్కడక్కడ ఎవరికైనా డబ్బులు రాకపోతే ఆందోళన అవసరం లేదని, ఓటరు స్లిప్పు పట్టుకుని స్థానికంగా ఉన్న పార్టీ కార్యాలయం లేదా గ్రామానికి సంబంధించిన ఇన్‌ఛార్జ్‌ను కలిస్తే డబ్బులు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎవరికైనా ఓటు ఉండి వాళ్లు స్థానికంగా ఉంటే తప్పనిసరిగా డబ్బులిస్తామని.. తమ దగ్గర ఉన్న లిస్ట్ఓలో డబ్బులు తీసుకున్నట్లు మార్క్‌ చేసి లేకపోతే ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారట. ఇలాంటి వాళ్ల కోసం గ్రామానికి ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఎవరికైనా డబ్బులు అందకపోతే పలానా వాళ్ల ఇంటికి వెళ్లి తీసుకోవాలని సూచిస్తున్నారట.


AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 11:36 AM

Advertising
Advertising