Budda venkanna: మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారు..
ABN, Publish Date - Mar 25 , 2024 | 12:29 PM
Andhrapradesh: ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రదారులపై 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమరావతి, మార్చి 25: ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna) ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీని (AP DGP) విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రదారులపై 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నించారు.
IPL 2024: నేడు RCB vs PBKS పోరు.. సొంత గ్రౌండ్‌లో గెలుస్తారా?
లోకేష్ (TDP Leader Nara Lokesh) అంటే ప్రభుత్వానికి (AP Government) భయం కాబట్టే అడుగడుగునా తనిఖీ చేస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారని విమర్శించారు. పోలీసు ఎస్కార్ట్‌తో నల్ల డబ్బును సాక్షి వాహనాల్లో రాష్ట్ర మంతటా పంపిణీ చేస్తున్నారా అని నిలదీశారు. ఎన్నికల్లో వైసీపీ వాడే డబ్బంతా ప్రజలదే అని అన్నారు. ఓటుకు రూ.30 వేలైనా మంగళగిరిలో పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజల నుంచి జగన్ కాజేసిన డబ్బుని ఇప్పుడు పంచుతున్నారన్నారు. ప్రజలు జగన్ ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం సైకిల్‌కు వేయాలని బుద్దావెంకన్న కోరారు.
ఇవి కూడా చదవండి..
London: నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి
Holi: రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకన్న ద్రౌపది ముర్ము.. పౌరులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, షా
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 25 , 2024 | 12:46 PM