ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: మంగళగిరి ప్రజలకు లోకేష్ బహిరంగ లేఖ

ABN, Publish Date - May 11 , 2024 | 04:10 PM

Andhrapradesh: మంగళగిరి ప్రజలకు టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ‘‘పేదరికం లేని మంగళగిరి నా కల’’ అంటూ యువనేత అందులో పేర్కొన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లన్నారు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గమన్నారు.

Lokesh Letter to people of Mangalagiri

అమరావతి, మే 11: మంగళగిరి ప్రజలకు (Mangalagiri People) టీడీపీ నేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) బహిరంగ లేఖ రాశారు. ‘‘పేదరికం లేని మంగళగిరి నా కల’’ అంటూ యువనేత అందులో పేర్కొన్నారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లన్నారు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గమన్నారు. మంగళగిరి ప్రజల ప్రేమ, అభిమానం తనను కట్టిపడేశాయన్నారు. ఓడిపోయిన మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Chandrababu: మీ ఎమ్మెల్యే ఇంటికి అల్లు అర్జున్ వస్తే.. ఇలా చేస్తారా?.. ఇది తగునా?


వారి ప్రోత్సాహంతోనే పాదయాత్ర చేశా..

ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేశామన్నారు. ప్రతి గడప తొక్కానని.. నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. యువగళం పాదయాత్ర సందర్భంగా దాదాపు ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నా తన మనసంతా మంగళగిరిలోనే అని చెప్పుకొచ్చారు. కుటుంబసభ్యుల్లా ఇక్కడి ప్రజలు తరచూ తనను కలుస్తూ తనపై చూపిన ఆప్యాయత మాటల్లో చెప్పలేనని ఆయన అన్నారు. వారందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రవ్యాప్తంగా 3132 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయగలిగానని టీడీపీ నేత తెలిపారు.

Viral: ఆవలిస్తే ఇలాక్కూడా జరుగుతుందా? యువతికి ఊహించని షాక్!


జీవితంలో మరువలేను...

‘‘జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులు పెట్టి 53రోజులు రాజమండ్రి జైలులో పెట్టినప్పుడు మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతిక మద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేను. 25 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన రెండు కుటుంబాలు చేసింది ఏంటో ప్రజలంతా ఒక్క సారి ఆలోచించాలి. రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పత్తాలేకుండా పోతే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉన్నాను. మంగళగిరి ప్రజలు నా కుటుంబసభ్యులు అనుకొని సేవలందించాను. సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ఒక వ్యక్తిగానే ఇంత చేసిన నన్ను శాసనసభకు పంపితే ఏవిధంగా సేవచేస్తానో చైతన్యవంతులైన మంగళగిరి ప్రజలు ఆలోచించాలి. వ్యక్తిగతంగా ఎంత చేసినా... మంగళగిరి రూపురేఖలు మార్చడానికి నేను చేయాల్సింది చాలా ఉంది. మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్ది, పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నదే నా సంకల్పం. అందరం కలసి ఆదర్శ మంగళగిరిని తయారు చేసుకుందాం’’ అంటూ లోకేష్ లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Arvind Kejriwal: యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..

Kejriwal: వన్ నేషన్.. వన్ లీడర్ మిషన్‌ మోదీ ఉద్దేశం: కేజ్రీవాల్ విసుర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 04:14 PM

Advertising
Advertising