ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

High Court of AP: చంద్రగిరి, సత్తెనపల్లిల్లో రీపోలింగ్‌ వ్యాజ్యాలు కొట్టివేత

ABN, Publish Date - May 24 , 2024 | 06:46 AM

చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ బూత్‌ల్లో రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీసీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు.

ఫాం-17(ఏ)లను స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచాం

కౌంటింగ్‌ రోజు మాత్రమే బయటకు తీయగలం

ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యానికి వీల్లేదు

హైకోర్టులో ఈసీ వాదనలు.. ఏకీభవించిన ధర్మాసనం

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ బూత్‌ల్లో రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీసీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. పిటిషన్లకు విచారణార్హత లేదని, ఈవీఎం, వీవీప్యాట్ల స్ర్కూటినీ సమయంలో అభ్యర్థులు ఉండాలని ఎలాంటి చట్టబద్ధమైన నిబంధన లేదని పేర్కొన్నారు. స్ట్రాంగ్‌ రూంలు సీజ్‌ చేసేముందు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాట్లను స్ర్కూటినీ చేయాలని ఆర్వోలకు ఈసీ సూచనలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఈవీఎంల స్ర్కూటినీకి సంబంధించిన 17(ఏ) ఫాంలను స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచామని, కౌంటింగ్‌ రోజు మాత్రమే వాటిని బయటకు తీయగలమని తెలిపారు.

అన్ని వివరాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత రీపోలింగ్‌ అవసరం లేదని ఈసీ నిర్ణయించిందని చెప్పారు. పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే ఈసీకి పిటిషన్‌ దాఖలు చేసుకోవాలి తప్ప హైకోర్టులో రిట్‌ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 329(బి) మేరకు ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, అందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని విన్నవించారు.

ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. ఈవీఎం, వీవీప్యాట్ల స్ర్కూటినీ తన సమక్షంలో నిర్వహించి ఫాం-17(ఏ)లను రూపొందించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని పలు బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ బూత్‌లలో వెబ్‌ కెమెరా ఫుటేజ్‌లు, తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఆయా పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అక్కడి వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. మోహిత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, అంబటి రాంబాబు తరఫున న్యాయవాది వీఎన్‌ఆర్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపించారు.

Updated Date - May 24 , 2024 | 06:50 AM

Advertising
Advertising