AP Elections: తిరుపతిరావు, కేశినేని చిన్ని పోటాపోటీ ఆరోపణలు..
ABN, Publish Date - May 13 , 2024 | 11:30 AM
Telangana: మైలవరం వీవీఆర్ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని ) సందర్శించారు. ఈవీఎం మొరాయింపుపై ఏఆర్‌ఓ రాజేశ్వరరావుపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి.
ఎన్టీఆర్ జిల్లా, మే 13: మైలవరం వీవీఆర్ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) (TDP Leader Kesineni Chinni) సందర్శించారు. ఈవీఎం మొరాయింపుపై ఏఆర్‌ఓ రాజేశ్వరరావుపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి. 91 పోలింగ్ బూతులో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 ఓట్లు పోలింగ్ అయిన అనంతరం జీరో చేయడంపై కేశినేని చిన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు
Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..
91వ బూత్‌లోకీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులతో వెళ్లడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. వైసీపీ నాయకులు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యహహారంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, కూటమి అభ్యర్థి కేశినేని చిన్నిలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నారు. వైసీపీ వారిని ఖాళీ చేయించాలని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ మురళీమోహన్.. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలింగ్ బూత్‌ల సమీపంలో నుంచి పంపించేశారు.
ఇవి కూడా చదవండి..
Lok Sabha Polls 2024: అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే.
AP Election: మైలవరంలో ఉద్రిక్తత..
Read Latest AP News And Telugu News
Updated Date - May 13 , 2024 | 11:33 AM