YSRCP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో అనూహ్య మార్పులు
ABN, Publish Date - Jun 06 , 2024 | 07:58 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైఎస్సార్సీపీ (YSRCP) కకావికలం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైఎస్సార్సీపీ (YSRCP) కకావికలం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.
దీంతో కేడర్‌కు అందుబాటులో ఉండేలా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డి పలుమార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రస్తుతం ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేయాలని జగన్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లిలోని జగన్ నివాసం పక్కనున్న క్యాంపు కార్యాలయానికి వైసీపీ కార్యాలయం మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సీఎం క్యాంపు ఆఫీసుగా ఉన్న భవనం.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంగా మారనున్నది. జూన్ 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించేలా కీలక నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కంప్యూటర్లు, ఇతర సామగ్రి తరలించడానికి వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - Jun 06 , 2024 | 08:06 PM