AP Elections 2024: ఓటర్లకు వెరైటీ ఆహ్వాన పత్రిక.. అదిరిపోయిందిగా.. ఓ లుక్కేయండి!
ABN, Publish Date - May 10 , 2024 | 03:41 PM
ఓటు హక్కు ఉన్నప్పటికీ, చాలామంది వాటిని సద్వినియోగపరచుకోరు. పోలింగ్ డేను సెలవుగా ఎంజాయ్ చేస్తుంటారు. గంటల తరబడి సమాజం, ప్రభుత్వ పనితీరు, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారు కానీ..
ఓటు హక్కు (Vote) ఉన్నప్పటికీ, చాలామంది వాటిని సద్వినియోగపరచుకోరు. పోలింగ్ డేను సెలవుగా ఎంజాయ్ చేస్తుంటారు. గంటల తరబడి సమాజం, ప్రభుత్వ పనితీరు, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారు కానీ.. పోలింగ్ రోజు వచ్చేసరికి అబ్బే.. కంటికి కనిపించరు. ‘నా ఒక్క ఓటుతో పెద్దగా ఒరిగేదేమీ ఉండదులే’ అనుకొని ఇళ్లల్లోనే ఉండిపోతుంటారు. అలాంటి వారికి ఓటు విలువ తెలియజేయడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. కేవలం ఎన్నికల కమిషన్స్ మాత్రమే కాదండోయ్.. బాధ్యత కలిగిన వ్యక్తులు సైతం వినూత్న మార్గాల్లో ‘ఓటు హక్కు’పై అవగాహన కల్పిస్తుంటారు.
అలా చేయకపోతే.. పాకిస్తాన్ అణుబాంబులేయడం తథ్యం
రండి రారండి!
ఇప్పుడు తాజాగా విశాఖపట్నం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అయిన డా. ఏ మల్లికార్జున (IAS) ‘ఓటింగ్ ఆహ్వాన పత్రిక’ను ముద్రించారు. ఆంధ్ర రాష్ట్రంలో మే 13న జరగబోయే ఎన్నికల పండుగలో (AP Elections 2024) ప్రతిఒక్కరూ భాగం కావాలని అందులో ప్రింట్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మహోత్సవానికి తప్పకుండా హాజరవ్వాలని కోరారు. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం జిల్లాలోని ఓటర్లందరూ.. ఈ ఎన్నికల పండుగలో పెద్దఎత్తున హాజరై, మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు. మే 13వ తేదీన.. అంటే సోమవారం రోజున ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల దాకా పోలింగ్ జరగనుందని.. ఓటరు అతిరథ మహారథులందరూ ఇందుకు ఆహ్వానితులని జిల్లా కలెక్టర్ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డిజిటల్ పత్రిక నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
ఇదొక ట్రెండ్!
ఇలా ఎన్నికల ఆహ్వాన పత్రికను ముద్రించడం ఇదే మొదటిసారి కాదు. శ్రీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిత్రా సైతం వినూత్న రీతిలో ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. ఓటర్లందరూ తమ కుటుంబంలోని ఓటర్లను తీసుకొని.. ఈ ఎన్నికల పండుగకు తప్పకుండా హాజరవ్వాల్సిందిగా కోరారు. కొత్త సంప్రదాయానికి నాంది పలికే ఫలాలను అందుకోవాలని, ప్రతి ఓటర్ ఓటు వేసేందుకు తమ గుర్తింపు కార్డును వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. సరిగ్గా ఇదే పద్ధతిలో ఓ ఓటరు సైతం.. ఓ వినూత్న ఆహ్వాన పత్రికను తయారు చేసి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని తెలిపాడు.
Read Latest Andhra Pradesh News and Telugu News
Updated Date - May 10 , 2024 | 03:41 PM