ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Results: మనమేమీ రూల్స్‌ ఫాలో అవడానికి రాలేదు!

ABN, Publish Date - May 30 , 2024 | 02:32 AM

నిబంధనలు పాటించే కౌంటింగ్‌ ఏజెంట్లు తమకు వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు..

  • సాధ్యమైనంతవరకూ వాదన చేసేవాళ్లే..

  • కౌంటింగ్‌ ఏజెంట్లుగా కూర్చోండి

  • రూల్స్‌ అంటూ వెనక్కి తగ్గేవాళ్లు అయితే రావొద్దు: సజ్జల

  • తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు దిశానిర్దేశం

  • టీడీపీ, జనసేన ఏజెంట్లపై తిరగబడాలని ఆదేశం

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): నిబంధనలు పాటించే కౌంటింగ్‌ ఏజెంట్లు తమకు వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు. ‘మనం ఏమీ ఇక్కడ కూర్చొని రూల్స్‌ ఫాలో అవడానికి రాలేదు. సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లే కూర్చోండి. కౌంటింగ్‌ ఏజెంట్స్‌ రూల్స్‌ ఫాలో అయ్యి వెనక్కి తగ్గేవాళ్లు అయితే వద్దు రాకండి’ అని సజ్జల తేల్చిచెప్పారు. వైసీపీ లక్ష్యాన్ని చేరుకునేలా టీడీపీ, జనసేనలకు అడ్డం పడి.. పనిచేయాలని కర్తవ్యబోధ చేశారు. టీడీపీ, జనసేన ఏజెంట్లకు ప్రతి విషయంలోనూ అడ్డం తిరగాలని సూచించారు. వారు చేసే ప్రతిదానికీ ఏ విధంగా అడ్డం పడాలో ఆ విధంగా అడ్డంపడి దారికి తెచ్చుకోవాలన్నారు. నిబంధనలు కావేమోనని ఊరుకునేవాడు అవసరం లేదని తెగేసి చెప్పారు. ‘వైసీపీ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా .. మనకు అనుకూలంగానూ .. అవతలివాడి ఆటలు సాగకుండా చేయాలి. పొరపాటున తప్పులు చేసినా పర్వాలేదు కానీ, ఇది నిబంధనలకు విరుద్ధమేమో అంటూ రూల్స్‌ పాటించేవాడు వైసీపీకి ఏజెంట్‌గా అవసరంలేదు’ అని సజ్జల స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహిస్తున్నవారే రూల్స్‌ పాటించొద్దంటూ ఏజెంట్లకు సలహాలివ్వడంపై రాజకీయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - May 30 , 2024 | 08:08 AM

Advertising
Advertising