ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?

ABN, Publish Date - May 08 , 2024 | 03:53 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్‌ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

CM YS Jagana and Bharati

అమరావతి, మే 08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మే 17వ తేదీన లండన్‌కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య భారతి కూడా లండన్‌ ట్రిప్‌కు వెళ్లనున్నారు. మే 13వ తేదీన పోలింగ్ పూర్తవుతుంది. పోలింగ్ పూర్తవగానే లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు జగన్. లండన్ ప్రయాణ కోసం ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఈ పిటిషన్‌పై గురువారం నాడు కోర్టులో విచారణ జరగనుంది.


విదేశాల్లో జగన్ కుమార్తెలు..

వైఎస్ జగన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరు అమెరికాలో ఉండగా.. మరొకరు లండన్‌లో ఉన్నారు. వారిని చూసేందుకు మే 17 నుంచి మే 30 వరు లండన్, అమెరికాకు వెళ్లాలని జగన్, ఆయన భార్య భారతి నిర్ణయించుకున్నారు. అయితే, సీబీఐ, ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్.. దేశం దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే తాము లండన్, అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు జగన్. ఈ అభ్యర్థనపై గురువారం విచారణ జరగనుంది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జగన్ విదేశాలకు బయలుదేరుతారు.


మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు..

మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ అనంతరం జగన్ విదేశాలకు వెళ్తారు. మే 30 వరకు ఆయన అక్కడే ఉంటారు. ఆ తరువాత తిరుగు పయనం అవుతారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు వెలువడనున్నాయి.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 08 , 2024 | 04:07 PM

Advertising
Advertising