ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sharmila: రాముడికి లక్ష్మణుడిలా వైఎస్ఆర్‌కు వివేకా: వైఎస్ షర్మిల

ABN, Publish Date - May 02 , 2024 | 11:51 AM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. తన సోదరుడు, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి ఈ రోజు ప్రచారం ప్రారంభించారు.

YS Sharmila

కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దూసుకెళ్తున్నారు. తన సోదరుడు, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి ఈ రోజు ప్రచారం ప్రారంభించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో తన తండ్రి వైఎస్ఆర్‌కు వివేకా అలా ఉండేవారని వివరించారు. అలాంటి వివేకానంద చనిపోయి 5 ఏళ్లు అయ్యింది.. ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు.


‘తన చిన్నాన్న వివేకాను గొడ్డలితో ఏడు సార్లు క్రూరంగా హత్య చేశారు. ఎవరు చంపారో అందరికీ తెలుసు. హత్యకు సంబంధించి సీబీఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడనే సాక్ష్యాలు ఉన్నాయి. వైఎస్ఆర్ తమ్ముడు చనిపోయాడు. హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూలులో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి అడ్డు పడ్డాడు. హంతకులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారు. హత్య జరిగిన సమయంలో సీబీఐ విచారణ కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ వద్దన్నారు. సీబీఐ విచారణ అంటే జగన్ ఎందుకు బయపడుతున్నారు అని’ షర్మిల ప్రశ్నించారు.


‘కొంగుచాచి న్యాయం అడుగుతున్నాం. మీరు న్యాయం వైపు నిలబడతారని అనుకుంటున్న. నేను మీ బలం, నేను మీ గొంతు. మీ బిడ్డగా ఇక్కడే ఉంటా. మీ కోసమే నా జీవితం అంకితం. న్యాయం కోసం ప్రతి ఒక్కరినీ ప్రార్థిస్తున్నా. దయచేసి తమకు న్యాయం చేయాలని ప్రజలను’ వైఎస్ షర్మిల కోరారు.


Read Latest
AP News and Telugu News

Updated Date - May 02 , 2024 | 01:50 PM

Advertising
Advertising