YSRCP: పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన వైసీపీ వర్గాలు
ABN, Publish Date - May 08 , 2024 | 01:13 PM
ముప్పాళ్ళ మండలం మాదలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హోమ్ ఓటింగ్ విషయంలో వివాదం చెలరేగింది. టీడీపీ సానుభూతి పరుడైన బుషయ్య ఇంటికి ఓటు కోసం వైసీపీ వర్గాలు వెళ్లాయి. అదే సమయంలో టీడీపీ వర్గాలు సైతం అక్కడకు వచ్చాయి. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గాలు రాళ్లు రువ్వాయి. ఇదే సమయంలో మీడియాపై సైతం వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.
పల్నాడు జిల్లా: ముప్పాళ్ళ మండలం మాదలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హోమ్ ఓటింగ్ విషయంలో వివాదం చెలరేగింది. టీడీపీ సానుభూతి పరుడైన బుషయ్య ఇంటికి ఓటు కోసం వైసీపీ వర్గాలు వెళ్లాయి. అదే సమయంలో టీడీపీ వర్గాలు సైతం అక్కడకు వచ్చాయి. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గాలు రాళ్లు రువ్వాయి. ఇదే సమయంలో మీడియాపై సైతం వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా కూడా ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. వైసీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
CM Ramesh: సీఎం రమేష్‌పై మంత్రి ముత్యాలనాయుడు సంచలన కామెంట్స్..
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారు. నయానో భయానో టీడీపీ కార్యకర్తలను దారిలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులకు వైసీపీ కార్యకర్తలు తెగబడుతున్నారు. ఇదంతా వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్భలంతోనే జరుగుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌన వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth: రేవంత్ చేతులకు గోర్లతో రక్కిన గాయాలు.. అసలేమైంది..?
Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..
Read Latest AP News And Telugu News
Updated Date - May 08 , 2024 | 01:13 PM