AP Election 2024: ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తున్న తాడిపత్రి
ABN, Publish Date - May 14 , 2024 | 06:28 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నిన్న(సోమవారం) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సమయంలో వైసీపీ (YSRCP) పలు అల్లర్లు, అరాచకాలు సృష్టించింది. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ మూకలు పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగడుతున్నాయి. తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.
అనంతపురం : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నిన్న(సోమవారం) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సమయంలో వైసీపీ (YSRCP) పలు అల్లర్లు, అరాచకాలు సృష్టించింది. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ మూకలు పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగడుతున్నాయి. తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.
వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాళ్లదాడి చేశారు. ఈ రాళ్లదాడిలో పలువురు టీడీపీ నేతలు, అడిషనల్ ఎస్పీ రామకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్పీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున చేరి రాళ్ల దాడులకు పాల్పడుతున్నాయి. వైసీపీ నేతలను అడ్డుకోడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకుంటున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అనుచరులు దూసుకుపోతున్నారు. దాడులను అడ్డుకోవడానికి పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి, పెద్దారెడ్డి ఇంటికి మధ్యలో ఉన్న కాలేజీ గ్రౌండ్ రణరంగంగా మారింది. కార్యకర్తలను చదరగొట్టేందుకు పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర టెన్షన్ నెలకొంది.
AP News.. పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత
Read Telangana News And Telugu News
Updated Date - May 14 , 2024 | 07:00 PM