ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: భరత్ ప్రచార రథానికి నిప్పు

ABN, Publish Date - Jun 29 , 2024 | 09:43 AM

మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధంమైంది. రాజమహేంద్రవరం వీఎల్ పురంలో గల మార్గాన్ని ఎస్టేట్స్‌ ఆఫీసులో ప్రచార రథం ఉంది. శుక్రవారం (నిన్న) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథానికి నిప్పు పెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్‌కు సమాచారం ఇచ్చారు.

Margani Bharath

రాజమహేంద్రవరం: మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ (Margani Bharath) ఎన్నికల ప్రచార రథం దగ్ధంమైంది. రాజమహేంద్రవరం వీఎల్ పురంలో గల మార్గాన్ని ఎస్టేట్స్‌ ఆఫీసులో ప్రచార రథం ఉంది. శుక్రవారం (నిన్న) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథానికి నిప్పు పెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి మార్గాని భరత్ చేరుకున్నారు. తర్వాత ప్రకాష్ నగర్, బొమ్మూర్ పోలీసులు వచ్చారు. ఘటన గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.


భరత్ ఏమన్నారంటే..?

‘రాజమహేంద్రవరంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి విష సంస్కృతిని నేను ఎప్పుడూ చూడలేదు. నగరంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం దారుణం. అధికార పార్టీ నేతల అండదండలతో దాడులు జరుగుతున్నాయి. ప్రచార రథం దగ్ధం ఘటన గురించి డీజీపీకి చెబుతా. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతాను అని’ మార్గాని భరత్ స్పష్టం చేశారు. మార్గాని భరత్ ప్రచార రథాన్ని ఎవరైనా కావాలనే తగులబెట్టారా.? లేదంటే ప్రమాదవశాత్తు వాహనంలో చెలరేగాయా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. భరత్ మాత్రం టీడీపీ నేతల ప్రోద్బలంతో జరిగిందని స్పష్టం చేశారు.

Updated Date - Jun 29 , 2024 | 09:44 AM

Advertising
Advertising