ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మీరు ఉన్న చోట భూకంపం వస్తే.. ఏం చేయాలో తెలుసా..

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:45 PM

సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాక్‌కు గురవుతుంటారు. అప్పటివరకూ అంతా మామాలుగా సాగిన వారి జీవితం.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు.

అమరావతి: తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఇవాళ (బుధవారం) వచ్చిన భూకంపం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మేడారం అడవుల్లో భూమికి 40కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. రిక్టార్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించారు. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలపై పడింది. ఇరు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల భూమి కంపించడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఊగిపోవడంతో అంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.


సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాక్‌కు గురవుతుంటారు. అప్పటివరకూ అంతా మామాలుగా సాగిన వారి జీవితం.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. కొంతమంది తేరుకుని ఇంటి నుంచి బయటకు పరుగులు పెడితే, మరికొంతమంది ఏం చేయాలో అర్థంకాగా గాబరా పడిపోతుంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తమను, తమ కుటుంబసభ్యులను ఎలా రక్షించుకోవాలనే ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతుంది. ఆ సమయంలో ఏం చేయాలి, ఏ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


జపాన్ దేశానికి తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఆ సమయంలో వాటి తీవ్రత, ప్రాణ, ఆస్తి నష్టం సైతం భారీగానే ఉంటుంది. అయితే భూకంపాల నుంచి రక్షించికునేందుకు ఆ దేశస్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగానే అక్కడి ఇళ్లు, పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లను సైతం భూకంపాలు తట్టుకునేలా నిర్మిస్తారు. అయితే మన దేశంలో సాధారణంగా భూకంపాలు తక్కువగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే..

  • భూకంపం వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా ఉన్నచోటే కదలకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

  • భయంతో పరిగెత్తడం, అరవడం వంటి పనులు చేయకూడదు. భయంతో మీరు అరిస్తే చుట్టూ ఉన్నవారు సైతం భయపడే అవకాశం ఉంటుంది.

  • మీరు ఇంట్లో లేదా ఆఫీసులో ఉన్నట్లయితే కాళ్లు, చేతులు దగ్గరికి ముడుచుకుని ఏదైనా టేబుల్ లేదా డెస్క్ కిందకు వెళ్లి దాక్కోవాలి. అలా చేస్తే పైనుంచి పడే వస్తువుల వల్ల గాయాలు కాకుండా ఉంటాయి.

  • భూకంపం వచ్చినప్పుడు కిటికీలు, బీరువా, భారీ ఫర్నీచర్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి మీద పడి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది.

  • భవనం పైఅంతస్థులో ఉన్నా లేదా అది కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నా కింద ఫ్లోర్‌కు వెళ్లిపోవాలి. కిందికి వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ వాడకూడదు. ఎందుకంటే అవి మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

  • భూకంపం వచ్చినప్పుడు గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఒకవేళ మీరు ఇంటి బయట ఉంటే అక్కడే ఉండిపోవాలి. భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, చమురు, గ్యాస్ లైన్లకు దూరంగా ఉండాలి.

  • విద్యుత్ తీగలు వేలాడుతూ కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని తాకకూడదు. కంగారులో పరిగెత్తితే వాటికి తగిలి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

Hyderabad: భూప్రకంపనలపై ప్రముఖ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే..

Updated Date - Dec 04 , 2024 | 12:49 PM