Tirumala : శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:59 AM
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల/పిట్టలవానిపాలెం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీబగళాముఖికి ప్రత్యేక పూజలు
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందో లులోని శ్రీబగళాముఖి అమ్మవారికి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆదివారం పూజలు జరిపారు.