Perni Nani: చంద్రబాబు సావాసాలన్నీ దొంగలతోనే...
ABN, Publish Date - Mar 22 , 2024 | 04:35 PM
Andhrapradesh: బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటెయినర్‌లో 25 వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ పట్టుబడటంపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 25 వేల కిలోల డ్రగ్స్ ఓ కంటైనర్ విశాఖకు చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. ఆ డ్రగ్స్ బయటకు రాకుండా సీబీఐ పట్టుకోవడం అదృష్టమన్నారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు.. వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతోందని చెప్పారు. సీబీఐ నోరు విప్పక ముందే చంద్రబాబు, టీడీపీ వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
అమరావతి, మార్చి 22: బ్రెజిల్ నుంచి విశాఖపట్నం (Visakhapatnam) వస్తున్న కంటెయినర్‌లో 25 వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్ పట్టుబడటంపై మాజీ మంత్రి పేర్నినాని (Former minister Perni Nani) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 25 వేల కిలోల డ్రగ్స్ ఓ కంటైనర్ విశాఖకు చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. ఆ డ్రగ్స్ బయటకు రాకుండా సీబీఐ పట్టుకోవడం అదృష్టమన్నారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు.. వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతోందని చెప్పారు. సీబీఐ నోరు విప్పక ముందే చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), టీడీపీ (TDP), వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వాళ్లంతా.. టీడీపీ బంధువులే అంటూ వ్యాఖ్యలు చేశారు. వదినకు, మరిదికి చుట్టాలే.. బీరకాయ పీచు సంబంధాలే అంటూ ఎద్దేవా చేశారు.
Arvind Kejriwal: అరెస్టయ్యాక అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్.. సంచలన వ్యాఖ్యలు
ఈ డ్రగ్స్ రవాణ వెనుక చంద్రబాబు చుట్టాలు ఉంటూనే జగన్ (CM Jagan) మీద విషం చిమ్ముతున్నారన్నారు. బ్రాందీ పంచే స్థాయిని దాటి డ్రగ్స్ పంచే స్థాయికి చంద్రబాబు, లోకేష్ దిగజారారా అనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు సావాసాలన్నీ దొంగలతోనే అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిన వాడు కాబట్టి.. డ్రగ్స్ రవాణపై లోతైన విచారణ చేపట్టాలని అన్నారు. ఓటు కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు కాబట్టి.. విచారణ జరిపించాలని కోరామన్నారు. ఎన్నికల నియామళిని ఉల్లంఘించి డ్రగ్స్ రవాణ విషయంలో చంద్రబాబు ట్వీట్ చేశారన్నారు. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే అని చెప్పుకొచ్చారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేశారని పేర్ని నాని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 22 , 2024 | 04:35 PM