ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganta Srinivasarao: ఆంధ్రా యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రం మార్చేశారని గంటా ఫైర్

ABN, Publish Date - Jun 28 , 2024 | 01:26 PM

ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా విమర్శించారు. వైస్ ఛాన్సలర్‌గా కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారని విమర్శించారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయపార్టీ కార్యాలయంగా మార్చేశారని ఫైర్ అయ్యారు.

విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా విమర్శించారు. వైస్ ఛాన్సలర్‌గా కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారని విమర్శించారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయపార్టీ కార్యాలయంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. దేవాలయం లాంటి ఈ పవిత్రమైన విద్యాసంస్థను వైసీపీ ప్రభుత్వం ఒక ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేశారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.


ఆంధ్రా యూనివర్సిటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పేరు ఉండేదన్నారు. విద్యా ప్రమాణాల పరంగా ఎక్కడకు వెళ్ళినా ఆంధ్రా యూనివర్సిటీ పట్టా అంటే చాలా విలువనిచ్చే వాళ్లని.. ఇప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠను మసకబారేలా చేశారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విద్యా ప్రమాణాలు పడిపోయాయని.. విద్యలో నాణ్యత ఎప్పుడూ లేనంతగా దిగజారినపోయేలా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం నియమించిన వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి.. వైస్ ఛాన్సలర్‌లా కాకుండా కరడు గట్టిన వైసీపీ నాయకుడిలా, రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ యూనివర్సిటీని భ్రష్ఠు పట్టించాడని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో యూనివర్సిటీ కి పూర్వ వైభవం తీసుకొచ్చి.. దేశంలో నంబర్ వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడం తథ్యమని గుర్తు పెట్టుకోవాలని జగన్‌కు గంటా శ్రీనివాసరావు సూచించారు.

Updated Date - Jun 28 , 2024 | 01:26 PM

Advertising
Advertising