26న జీఎ్‌సఎల్వీ ప్రయోగం!
ABN , Publish Date - Jan 03 , 2024 | 03:21 AM
పీఎ్‌సఎల్వీ-సీ58 విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో.. ఈ నెలలోనే మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.
ళ్లూరుపేట, జనవరి 2: పీఎ్‌సఎల్వీ-సీ58 విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన ఇస్రో.. ఈ నెలలోనే మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 26న జీఎ్‌సఎల్వీ ప్రయోగం నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ రాకెట్ ద్వారా ఇన్‌శాట్-3డీఎ్‌స ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌లో ఉపయోగించే ధ్రవ ఇంధనాన్ని తమిళనాడులోని మహేంద్రగిరి నుంచి రెండు ప్రత్యేక వాహనాల్లో రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ మంగళవారం షార్‌కు తీసుకొచ్చారు.