TDP: జగన్ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని
ABN, Publish Date - Jun 18 , 2024 | 01:55 PM
బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కుంటుపడిందన్నారు.
బాపట్ల జిల్లా: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం (Raypalle Constituency) ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani Satya Prasad) అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి రేపల్లె (Repalle)లో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)లో అభివృద్ధికి కుంటుపడిందని, జగన్ రెడ్డి (Jagan Reddy)ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. జగన్ తనపై ఉన్న కేసుల కోసమే కేంద్రం చుట్టూ తిరిగారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి (NDA Kutami) రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు అన్యాయం జరిగిందని, వైసీపీ నేతల స్వంత ప్రయోజనాల కోసం కొన్ని పాలసీలు తీసుకొచ్చారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ప్రజా వ్యతిరేక పాలసీలపై అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. రీసర్వే పేరుతో ప్రజలను మోసం చేశారని, భీమిలిలో అద్భుతమైన స్థలాలను కొల్లగొట్టారన్నారు. జగన్ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రజలకు న్యాయం జరిగేలా తాము చూస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇబ్బంది అయితే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి
పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
లోకేష్ ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన
ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు
ఏలూరు జిల్లా: అత్తా, కోడలు ఆత్మహత్యయత్నం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 18 , 2024 | 01:58 PM