CM Chandrababu: ఆర్థిక ఇబ్బందులు, పరిష్కారంపై దృష్టి..
ABN, Publish Date - Aug 14 , 2024 | 07:28 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఇసుక విధానంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుక దోచుకున్నారని, మద్యం దుకాణాల ద్వారా వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించారని సీఎం మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఇసుక విధానంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుక దోచుకున్నారని, మద్యం దుకాణాల ద్వారా వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించారని సీఎం మండిపడ్డారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెనీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై వైసీపీ నేతలు బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల మాటలు నమ్మెుద్దంటూ ఆయన ప్రజలకు సూచించారు. శాండ్ అవసరమైన వారు కూలీ, సీనరేజ్, రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించి తెచ్చుకోవచ్చని తెలిపారు. త్వరలో అన్ని సచివాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన 60రోజుల పాలనలో ఆర్థిక ఇబ్బందులు, వాటి పరిష్కారంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి శనివారం రోజున ప్రజా సమస్యలపై స్థానిక నేతలు వినతులు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోందని, మనం మళ్లీ గెలవాలంటే నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. గాడితప్పిన రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఎన్టీపీసీతో చంద్రబాబు సర్కార్ కీలక ఒప్పందం.. 25ఏళ్లపాటు..
Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సంజయ్ కుమార్..
Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..
Updated Date - Aug 14 , 2024 | 07:29 PM