ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: అధికారంలోకి వైసీపీ.. జగన్ సరికొత్త జోస్యం..

ABN, Publish Date - Oct 03 , 2024 | 04:27 PM

ఓవైపు జగన్ తీరు నచ్చక పార్టీలో సీనియర్లు జగన్‌కు గుడ్‌బై చెబుతూ.. టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనలతోనే కొందరు నేతలు పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి భారీగా..

YS Jagan

వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో సమావేశమైన జగన్.. గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని జగన్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే.. ప్రభుత్వం ప్రజలను మెప్పించడంతో విఫలమైందని ఆరోపిస్తున్నారు.


ఓవైపు జగన్ తీరు నచ్చక పార్టీలో సీనియర్లు జగన్‌కు గుడ్‌బై చెబుతూ.. టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనలతోనే కొందరు నేతలు పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఒకడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే అంటూ జోస్యం చెప్పడం ప్రారంభించారు. ముందు పార్టీని వీడుతున్న కేడర్‌ను కాపాడుకోకుండా.. నాలుగున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ జగన్ చెప్పడం దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది.


జోస్యం చెబుతున్నారా..

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ బెంగళూరు వెళ్లి జోస్యం నేర్చుకున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగి ఆరు నెలలు పూర్తి కాలేదు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పిన జగన్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. సింహాం సింగిల్‌గా వస్తుందంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ పలికారు. అయినప్పటికీ ప్రజలు వైసీపీని విశ్వసించలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి కాలేదు. 2019-2034 మధ్య లక్షల కోట్ల రూపాయిలు అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందనే విమర్శలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉచిత పథకాల అమలుపై ఆచితూచి వ్యవహారిస్తోంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన తర్వాత.. ఆదాయ వనరులను పెంచి పథకాలను అమలుచేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వకుండా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది.. రానున్నది వైసీపీ ప్రభుత్వమంటూ జగన్ వ్యాఖ్యానించడం జోస్యం చెప్పినట్లే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తగినంత సమయం ఇవ్వకుండా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మాని.. పార్టీ బలోపేతంపై దృష్టిపెడితే రానున్న రోజుల్లో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు రాజకీయ పండితులు సూచిస్తున్నారు. జగన్ ఇప్పటికైనా తన తీరును మార్చుకుంటారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 03 , 2024 | 05:33 PM