ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఆ పనుల కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీలు నియమించిన ఏపీ ప్రభుత్వం..

ABN, Publish Date - Nov 30 , 2024 | 07:40 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది.

Minister BC Janardhan Reddy

అమరావతి: రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏపీ ప్రభుత్వం నియమించింది. పలువురు సభ్యులతో కూడిన రెండు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు మంత్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ శాఖ అనుమతులు, లెవెల్ క్రాసింగ్ మూసివేతల అనుమతులు, యుటిలిటీస్ షిప్టింగ్, నిధుల విడుదల వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.


ఈ కమిటీలో రవాణా, రోడ్లు & భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్, ఆర్ & బీ(ఆర్ఎస్‌డబ్ల్యూ) శాఖ చీఫ్ ఇంజనీర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్-వాల్తేర్), చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్‌స్ట్రక్షన్-రోడ్ సేప్టీ ప్రాజెక్ట్స్- సికింద్రాబాద్), చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్- సికింద్రాబాద్), చీఫ్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్-బెంగళూరు) సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశం కానుంది. రాష్ట్రంలో రైల్వే పనులు వేగవంతం చేయడానికి ఆయా సమస్యలు పరిష్కరించడంతోపాటు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.


అలాగే జాతీయ రహదారుల పనుల విషయానికి వస్తే.. ఆ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. 12 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా & కేంద్ర రోడ్లు, రవాణా, హైవే శాఖ) పనులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పని చేయనుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు పరిష్కరించడం, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి మంత్రి ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీ పని చేయనుంది.


ఈ కమిటీలో జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గనులు, భూగర్భవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రవాణా, ఆర్ & బీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్, రీజనల్ ఆఫీసర్ (మోర్త్-ఏపీ), రీజనల్ ఆఫీసర్ (ఎన్‌హెచ్‌ఏఐ-ఏపీ), ఆర్ & బీ, ఆర్ఎస్‌డబ్ల్యూ చీఫ్ ఇంజనీర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్‌స్ట్రక్షన్-రోడ్ సేప్టీ ప్రాజెక్ట్స్- సికింద్రాబాద్) సభ్యులుగా ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Guntur: భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్..

Solar Power : వద్దంటే విన్నారా!?

Updated Date - Nov 30 , 2024 | 07:44 AM