ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం.. కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:41 PM

ఏపీ టెక్స్‌టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్‌లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్‌లో ఆమోదించినట్లు చెప్పారు. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ ఎడ్జెస్ట్ మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం తాగునీటి వసతి, వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు పదిన్నర లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.

అమరావతి: ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ(మంగళవారం) సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అయింది. ఈ సమావేశంలో 10 అంశాలపై కేబినెట్‌లో కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 3గంటల పాటు సమావేశం సాగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాకు వెల్లడించారు. ‘‘ఇన్ఫ్‌ర్మెషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29కి ఆమోదం తెలిపాం. 2047లో భాగంగా ఒక కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త లక్ష్యాల సాధనకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కో వర్కింగ్ స్పేస్‌లు, నైబర్ వర్కింగ్ స్పేస్‌లు క్రియేట్ చేయాలని నిర్ణయం. వర్క్‌ ఫ్రం హోంకు ఈ విధానం ఎంతో ఉపయోగపడనుంది. ఇలా స్పేస్‌లు డెవలెప్ చేసే వారికి ఇన్సెంటివ్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వ్యాపారాలతోపాటు ఐటీ కంపెనీలు అవే భవనాల్లో ఉండాలనే కోవర్కింగ్ స్పేస్ పనిచేస్తుంది’’ అని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు.


ALSO READ: రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు

టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు

‘‘వందమందికి వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఏపీ టెక్స్‌టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్‌లో ఆమోదం పొందింది. రూ.10 వేల కోట్లు పెట్టుబడులు ఈ రంగంలో రావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. చేనేత కార్మికులకు, పద్మశాలీలకు ఈ పాలసీ వల్ల ఎంతో ఉపయుక్తం అవుతుంది.ఈ పాలసీలో రాయితీలు పెద్ద ఎత్తున రాయితీ ఇస్తాం, పీపీపీ మోడ్‌లో అయిదు టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు ఈ పాలసీ లక్ష్యం.ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్‌లో ఆమోదం. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ ఎడ్జెస్ట్‌మెంట్ చేయబోతున్నాం. ఉద్దానం తాగునీటి వసతి పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు పదిన్నర లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం. దీనిలో ఒకటి మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం కాగా మరొకటి మాజీ ఆర్థిక మంత్రి నియోజకవర్గం. పీఎంఏవై ఆర్బన్ , పీఎంఏవై గ్రామీణ్ పథకాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించి నిర్మించడానికి క్యాబినెట్ ఆమోదం. పీఎంఏవై ఆర్బన్ , పీఎంఏవై గ్రామీణ్ పథకాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించి నిర్మించడానికి క్యాబినెట్ ఆమోదం. పర్యటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలు కల్పన సాధ్యం అవుతుంది. రాజధాని అమరావతిని ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం. రియల్ టైం గవర్నెన్స్‌ను తెచ్చి అప్పట్లో పాలనలో చంద్రబాబు రిఫార్మ్స్ తెచ్చారు. దీనికి సంబంధించి ఆర్టిజీ 4.0 అమలుకు ప్రతిపాదన. వాట్సాప్ ద్వారానే అన్ని రకాల సర్టిపికెట్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు.


ALSO READ: మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

జగన్ ప్రభుత్వం అమరావతి పనులను నిలిపేసింది: మంత్రి నారాయణ

అమరావతి రాజధాని పనులను కొంత మేరకు గత టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేశామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం మూడు ముక్కలు ఆటలు ఆడి రాజధాని పనులను నిలిపేసిందని మండిపడ్డారు. ఆ పనులు ఆగిపోయినా ఏజెంట్లను అలాగే ఉంచారని.. వారి మిషనరీ ఇక్కడే ఉండిపోయిందని చెప్పారు. అప్పట్లో ఇచ్చిన టెండర్ల రేటుకు ఇప్పడు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారని.. దీంతో సీఈలతో కమిటీ వేసి క్యాబినెట్‌లో అప్రూవ్ చేశామని గుర్తుచేశారు.

ఈ నెలాఖరులోగా పనుల పూర్తి..

‘‘అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్డు, లే అవుట్ రోడ్లతో పాటు చాలా పనులను చేశారు. రూ.11, 471 కోట్ల పనులకు అధారిటీలో ఆమోదం రాగా ఇవాళ క్యాబినెట్‌లో కూడా చెప్పి ఆమోదం పొందేలా చేశాం. అమరావతిలో పనులు చేయకపోగా ఉన్న రోడ్లను, ఏసీలు, డోర్‌లను తీసుకువెళ్లారు ఈ నష్టం రూ.286.78 కోట్లుగా అంచనా వేశారు. జీఎస్టీ ఇప్పడు టెండర్లు పిలవడం వల్ల రూ.452.35 లక్షలు పెరిగింది. 360 కిలో మీటర్లు ట్రంక్ రడ్లుకు ఎస్టిమేషన్ రూ.460 కోట్లు పెరిగాయి. 1200 కిలో మీటర్లు లే అవుట్ రోడ్లు, 3600 అపార్ట్‌మెంట్లు అందులో మేజర్ వర్క్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులను పూర్తిచేస్తాం. అప్పట్లో రూ. 41 వేల కోట్లు బడ్జెట్‌గా వేస్తే ఇప్పడు 30శాతం పెరగనుంది’’ అని మంత్రి నారాయణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Payyavula: మా వియ్యంకులు చేసేది ఆ వ్యాపారం మాత్రమే

TDP MLA: ‘చెవిరెడ్డి’ చేసింది తప్పుకాదా.. ప్రతిఒక్కరూ ఆలోచించండి

CM Chandrababu: ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వాటికి ఆమోదం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 05:52 PM