ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: ఆ మంత్రి రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం కుట్ర పన్నుతున్నారు:బాల వీరాంజనేయస్వామి

ABN, Publish Date - Feb 16 , 2024 | 08:48 PM

జగన్ రెడ్డి బదిలీల్లో భాగంగా కొండెపి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu Suresh) గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) అన్నారు.

అమరావతి: జగన్ రెడ్డి బదిలీల్లో భాగంగా కొండెపి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu Suresh) గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగాలకు పాల్పడి, దొంగ ఓట్లతో కొండెపి నియోజకవర్గంలో గెలవడానికి మంత్రి సురేశ్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మంత్రి పదవిని ఉపయోగించి, ఇష్టానుసారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఎండీవోలను కొండెపిలో నియమించారని తెలిపారు.

అధికారుల బదిలీలపై తాము కలెక్టర్‌ను ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదన్నారు. కలెక్టర్‌కు తెలియకుండా మంత్రే స్వయంగా తన సామాజికవర్గం వారిని తనకు అనుకూలంగా పనిచేసే వారిని ఎన్నికల విధుల్లో నియమిస్తున్నారని మండిపడ్డారు. కొండెపి నియోజకవర్గంలో జరుగుతున్న అధికారుల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి మంత్రి సురేశ్‌కు చెక్ పెడతామని హెచ్చరించారు. కొండెపిలో గెలవడమంటే.. దొంగఓట్లతో ఎర్రగొండపాలెంలో గెలిచినంత తేలికకాదని సురేశ్ తెలుసుకోవాలని బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 08:48 PM

Advertising
Advertising