AP Politics: మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ..
ABN, Publish Date - Jul 22 , 2024 | 03:54 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లోని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఛాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయనకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం మెుదటగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌తో సహా బీజేపీ ఎమ్మెల్యేలు లోకేశ్ ఛాంబర్‌కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లోని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఛాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయనకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం మెుదటగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌తో సహా బీజేపీ ఎమ్మెల్యేలు లోకేశ్ ఛాంబర్‌కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు. చాలా మంది వైసీపీ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని లోకేశ్‌కు బీజేపీ నేతలు చెప్పారు. అయినా తాము ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని వెల్లడించారు.
ఎన్డీయే కూటమిలో చేరికలపై కూటమి పక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదని బీజేపీ ఎమ్మెల్యేలు లోకేశ్‌కు చెప్పారు. ఈ ప్రతిపాదనపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే సరైన పద్ధతి అని దాన్ని వల్ల కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి భేదాభ్రిప్రాయాలు రాకుండా ఉంటాయని లోకేశ్ వారికి చెప్పారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి వైసీపీ నేత తోట త్రిమూర్తులు బీజేపీలో చేరుతున్నారా లేదా అనే అంశం చర్చకు వచ్చింది. పార్టీలో ఆయన చేరికపై వస్తున్న ఊహాగానాలపై మంత్రి సత్యకుమార్‌ను అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి సంబంధించి అలాంటి నిర్ణయం పార్టీలో ఇంకా చర్చకు రాలేదంటూ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చదవండి:
AP News: ఏపీ ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే..
Updated Date - Jul 22 , 2024 | 03:55 PM