ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: జీజీహెచ్ లో చికిత్స పొందుతూ నర్స్ సుహాన మృతి

ABN, Publish Date - Oct 22 , 2024 | 09:49 PM

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సుహాన జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈరోజు రాత్రి మృతిచెందింది. బ్రెయిన్ డెడ్ కావటంతో మూడు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరింది. రౌడీ షీటర్ నవీన్ దాడి చేయడంతో బ్రెయిన్ డెడ్ అయింది. రేపు జీజీహెచ్‌లో సుహానా కుటుంబ సభ్యులను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు.

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సుహాన జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈరోజు రాత్రి మృతిచెందింది. బ్రెయిన్ డెడ్ కావటంతో మూడు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరింది. రౌడీ షీటర్ నవీన్ దాడి చేయడంతో బ్రెయిన్ డెడ్ అయింది. రేపు జీజీహెచ్‌లో సుహానా కుటుంబ సభ్యులను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు. ఈ లోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. సుహానా బ్రెయిన్ డెడ్ ఘటన రాజకీయ ఆరోపణలకు వేదికైంది. వైసీపీ, టీడీపీ నేతల పోటా పోటీ పరామర్శలతో మాటల యుద్దం‌ మొదలైంది. ఇప్పటికే నవీన్‌ను తెనాలి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


సుహాన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీ షీటర్ నిన్న (శనివారం) సాయంత్రం యువతిని కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలో ఆమెను తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. సుహాన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే తమ కుమార్తెకు ఏం జరిగిందో తెలియని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం విని షాక్ అయ్యారు. ఇలా జరిగిందేంటని కన్నీటిపర్యంతం అయ్యారు. నవీన్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు.


అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన సుహానకు బ్రెయిన్ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే విషయాన్ని బాధిత కుటుంబానికి తెలిపారు. తామేమీ చేయలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో కుమార్తెను బతికించుకునేందుకు గుంటూరు, మంగళగిరిలోని పలు ఆస్పత్రుల చుట్టూ యువతి తల్లిదండ్రులు తిరిగారు. వైద్యులందరూ తామేమీ చేయలేమని చెప్పడంతో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చివరికి గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా యువతి మృతిచెందింది. ఈ ఘటన సంచలనంగా మారింది.యువతి మృతిపై సుహాన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రౌడీ షీటర్ నవీన్ యువతిని ఎక్కడికి తీసుకువెళ్లాడు, ఏం చేశాడు, ఎందుకు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయ్యిందనే పలు కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే వల్లభాపురం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై రౌడీ షీట్ ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 10:05 PM