ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షల రద్దు

ABN, Publish Date - Jun 21 , 2024 | 04:59 PM

ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏపీ హైకోర్ట్ ( AP High Court) రద్దు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29కి వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది.

అమరావతి: ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏపీ హైకోర్ట్ ( AP High Court) రద్దు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29కి వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. కామన్ ఎగ్జామినేషన్ బోర్డుకు పాఠశాల్లో పరీక్షలు నిర్వహించే హక్కు లేదని దాఖలు చేసిన రిట్ పిటీషన్‌పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.


కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు పేరిట లక్షల రూపాయలు ప్రైవేటు పాఠశాలల వద్ద వసూళ్లు చేస్తున్నారని న్యాయవాది ముతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. సాల్ట్ ప్రోగ్రామ్ పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్దమని న్యాయవాది పేర్కొన్నారు. కేంద్ర చట్టంలో ఉన్న సెక్షన్ 29కి ఈ కార్యక్రమం వ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పాఠశాల్లో ఉపాధ్యాయులు స్వయంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని   న్యాయవాది శ్రీ విజయ్ పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 04:59 PM

Advertising
Advertising