AP Elections: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో మీనా సూచనలు
ABN, Publish Date - Jun 02 , 2024 | 05:34 PM
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో కౌంటింగ్ ప్రక్రియకు ముందు, కౌంటింగ్(Counting of Votes) జరుగుతున్నప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్రలపై పలు సూచనలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో కౌంటింగ్ ప్రక్రియకు ముందు, కౌంటింగ్(Counting of Votes) జరుగుతున్నప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్రలపై పలు సూచనలు చేశారు. మంగళవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
సీఈవో మీనా ఏం సూచనలు చేశారంటే..?
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్‌ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలని, అయితే ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఏజంట్‌కు అవకాశం కల్పించాలన్నారు. కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం-17సి, పెన్ను, పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలన్నారు. వీటికి మించి ఏం ఉన్నా అనుమతించకూడదని స్పష్టం చేశారు.
ముకేశ్ కుమార్ మాట్లాడుతూ.. "అథారిటీ లెటర్స్ కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారు సెల్ ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పరాదు. అయితే కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ ఫోన్‌తో అనుమతించడానికి వీల్లేదు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లేందుకు, వచ్చేందుకు ప్రణాళిక పటిష్ఠంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రణాళికకు జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేయాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పక్కాగా పాటించాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21సి/21ఈలు మరుసటి రోజు ఈసీఐకి చేరాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలి" అని ఆదేశించారు.
"ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్రాల్లో అల్లర్లకు ప్రయత్నించే వారిని బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ దృష్ట్యా లెక్కింపు జరిగే 4వ తేదీతోపాటు ముందు, తర్వాతి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలి. ఈవీఎంల కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలి. మరుసటి రోజు చేద్దాంలే అనుకుంటూ వాయిదా వేయడానికి వీల్లేదు. ఇండెక్స్ కార్డులో ఎటువంటి తప్పులకూ ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పూరించాలి. ఆయా కార్డులు అన్నీ ఈనెల 8లోగా అన్నీ కార్యాలయాలకు అందజేయాలి" అని ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సుస్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:
National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఎంతమంది గాయపడ్డారంటే..?
For more latest Andhrapradesh news and Telugu news..
Updated Date - Jun 02 , 2024 | 05:34 PM