ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 20 , 2024 | 02:57 PM

రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారన్నారు. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని తెలిపారు.

CM Nara Chandrababu Naidu

అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు. అమరావతి రైతులు 1631 రోజులుగా ఆందోళన చేపట్టారని అన్నారు. రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని తెలిపారు. ఇక్కడి రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శమని చెప్పారు. అమరావతిలో ఈరోజు (గురువారం) చంద్రబాబు పర్యటించారు. అమరావతి (Amaravati) పరిధిలో కీలకమైన అన్ని ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఐకానిక్ సెక్రటేరియట్, అసెంబ్లీ, జడ్జిల నివాస సముదాయం, ప్రజాప్రతినిధుల నివాస సముదాయం సహా అన్నింటినీ పరిశీలించారు.

ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందని అన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరమని ఉద్ఘాటించారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని చెప్పారు. అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని మండిపడ్డారు.


Also Read: MLA Srinivasa Rao: పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి..

పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని చెప్పారు. ఈ రెండింటిని వైసీపీ (YSRCP) సర్వ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందన్నారు. అందరి ఆశీస్సులు.. స్థలన మహత్యం వల్లే అమరావతిని కాపాడేలా చేశాయని తెలిపారు. ఇక్కడున్న అల్లరి మూకలు అమరావతి నమూనాను కూడా విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు.

గత ఐదేళ్లలో అమరావతిలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. పైపులు దొంగిలించారు.. రోడ్లను విధ్వంసం చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పని ఎక్కడ ఆగిందో.. అక్కడే నిలిచిపోయిందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ సముదాయం 80 శాతం పూర్తి అయిందని వివరించారు. సెక్రటరీల బంగ్లాల్లో తుమ్మ చెట్లు మొలిచాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో ఐకానిక్ కట్టడాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read: Andhra Pradesh: మా ఉద్యోగాలు మాకివ్వండి.. మాజీ వాలంటీర్ల డిమాండ్..

అమరావతి ప్రజా రాజధాని..

‘‘అమరావతి ప్రజా రాజధాని. విశాఖ ఆర్థిక రాజధాని. కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తాం. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం. రాజధాని ఎక్కడుండాలంటే రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఎనిమిదో తరగతి పిల్లాడిని అడిగిన చెబుతాడు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడింది. పదేళ్ల తర్వాత ఏపీ రాజధాని ఏదంటే.. చెప్పలేని పరిస్థితి. ఇక్కడి రైతులు స్వచ్ఛంధంగా భూములిస్తే అపవాదులు వేశారు.. ఇబ్బందులు పెట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు.కానీ వైసీపీ రాజధానిని విధ్వంసం చేసింది’’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pawan Kalyan: పలు శాఖల అధికారులతో సమీక్షలు.. బిజీబిజీగా పవన్

YS Jagan: నాడు హేళన చేశారు.. నేడు పోరాడతామంటున్నారు..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 20 , 2024 | 03:55 PM

Advertising
Advertising