ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: వైసీపీ ఎక్సైజ్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం..

ABN, Publish Date - Jul 24 , 2024 | 03:39 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల్లో గత వైసీపీ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మండిపడ్డారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన వైసీపీ మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల్లో గత వైసీపీ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మండిపడ్డారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన వైసీపీ మద్యం పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పేదల జేబులు చోరీ చేశారని అసహనం వ్యక్తం చేశారు.

పిచ్చిపిచ్చి బ్రాండ్లు తీసుకువచ్చి పేదల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదు చెల్లింపులో ఆన్ లైన్ విధానం పెట్టకుండా మరో తప్పిదం చేసిందన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం చేశారని మండిపడ్డారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు తగ్గిస్తే 2019వైసీపీ హయాంలో వాటి సంఖ్య మళ్లీ పెంచారని ధ్వజమెత్తారు. మద్యం ధరలను సైతం 75శాతం పెంచారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, అందుకే బడ్జెట్ కూడా వెంటనే ప్రవేశపెట్టలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నిన్న(మంగళవారం) కేంద్రం ప్రత్యేకంగా ఏపీకి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చినా మనం మ్యానేజ్ చేసినా అది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని సీఎం అన్నారు. మనం కష్టపడి సంపాదించుకోగలిగితేనే శాశ్వత వెసులుబాటు వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విధ్వంసం, విద్యుత్ శక్తిపై వైట్ పేపర్, ఇసుక భూగర్జ ఖనిజ సంపదలపై మరో వైట్ పేపర్ పబ్లిష్‌ చేసినట్లు వెల్లడించారు.


శాసనసభ ఏపీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, సంక్షేమం, అభివృద్ధి సమతూల్యంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. ఏపీలో గత ఐదేళ్లపాటు జరిగిన పరిణామాలు 25సంవత్సారాలపాటు కూడా మనం కోలుకోలేం అన్నట్లుగా ఉన్నాయని సీఎం అన్నారు. పాలకుడు ఎలా ఉండకూడదో, పాలన ఎలా ఉండకూడతో గత ప్రభుత్వం హయాం ఒక కేస్ స్టడీ అవుతుందని ఎద్దేవా చేశారు. అవసరార్థంతో కొందరు తప్పలు చేస్తారు, అత్యాసతో మరికొందరు తప్పలు చేస్తారు, కానీ గత ఐదేళ్లు డబ్బుల ఉన్మాదంతో తప్పలు చేశారని మండిపడ్డారు. అందుకే బాధ, ఆవేదనతో ఇవాళ ఎక్సైజ్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.


ఏపీ ప్రభుత్వం ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఏపీ శాంతిభద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నట్లు ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగా ఇవాళ ఎస్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. దీంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలు చేసిన మద్యం విధానంపై ఫుల్ క్లారిటీ రానుంది.

Updated Date - Jul 24 , 2024 | 03:40 PM

Advertising
Advertising
<