ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఏపీ విద్యుత్ శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Nov 25 , 2024 | 04:41 PM

ఏపీ విద్యుత్ శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మరోసారి సీఎం చంద్రబాబు చర్చించారు.

అమరావతి: ఏపీ విద్యుత్ శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై వెలగపూడి సచివాలయంలో ఇవాళ(సోమవారం) ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పీఎం సూర్యఘర్, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్షించారు. కుసుమ పథకం, సోలార్ విలేజ్ కాన్సెప్ట్‌పై మాట్లాడారు.


వందశాతం సోలార్ విద్యుత్ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ప్రభుత్వం తీసుకుందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. సోలార్ ఎనర్జీ అంశంతో పాటు ఈ నెల 29వ తేదీన అనకాపల్లి జిల్లా పుడిమడకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన పైనా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మోదీ చేతుల మీదగా NTPC ద్వారా నేషనల్ గ్రిడ్ ఎనర్జీ లిమిటెడ్, హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి పౌండేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఎన్టీపీసీ ద్వారా నేషనల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ , హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ వేసే కార్యక్రమ ఏర్పాట్లపైనా సీఎం చంద్రబాబు చర్చించారు. సోలార్ పవర్ కంప్రెసర్డ్ బయోగ్యాస్‌పై ఈ రివ్యూలో సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో మాట్లాడారు.


శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యపై చర్చ..

శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు మల్లన్న దేవాలయానికి వెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శాశ్వత పరిష్కారానికి సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


కార్తీక మాసం కావడంతో వేలాదిగా భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్నారని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించి, పరిష్కార మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్‌ అండ్‌ బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో సమస్యపై చర్చించి, సమన్వయంతో భక్తుల ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్

AP NEWS:అదానీ స్కాంలో.. జగన్‌పై గోనే ప్రకాశరావు సంచలన ఆరోపణలు

Kollu Ravindra: వైసీపీలో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు... మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - Nov 25 , 2024 | 06:56 PM