ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Purandeswari: ఆ భవనాలను తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారు

ABN, Publish Date - Mar 05 , 2024 | 09:12 PM

రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. భస్మాసురుడు తనతలపై చేయి పెట్టుకున్నట్లు 2019లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను నెత్తిన పెట్టుకున్నారని చెప్పారు.

గుంటూరు జిల్లా: రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. భస్మాసురుడు తనతలపై చేయి పెట్టుకున్నట్లు 2019లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను నెత్తిన పెట్టుకున్నారని చెప్పారు. జగన్‌ని ప్రజలు సీఎంగా చేస్తే ఏపీకి ఇంతవరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై రూ.12 లక్షల కోట్లు అప్పు భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్రంలో తాకట్టుకు ఏదీ అనర్హం కాదు అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో గనులను ఏడు వేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.

పవిత్రమైన సచివాలయంను బ్యాంకుకు తనఖా పెట్టిన ఘనత వైసీపీది అని చెప్పారు.పైగా తనఖా పెట్టడం తప్పు కాదన్నట్లు వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన భవనాలను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.నాసిరకం మద్యం ద్వారా మహిళల మంగళ సూత్రాలు తెంచారని ధ్వజమెత్తారు. నా ఎస్సీలు అని చెబుతూ దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారని విరుచుకుపడ్డారు.బాబాయ్(వివేకానందారెడ్డి)ని చంపిన వారిని శిక్షించలేని జగన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చెల్లి(సునీతారెడ్డి) కు న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏం చేస్తారని నిలదీశారు. దిశ యాప్ పేరుకే తప్ప మహిళలకు ఉపయోగం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో యువతిని చంపితే వారికి ఇంతవరకు న్యాయం చేయలేదని దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 09:12 PM

Advertising
Advertising